AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!

అమ్మ చేతి గోరు ముద్ద.. బిడ్డలకు అమృతంతో సమానం! కానీ.. అది ఒకప్పటి మాట!! మనిషి జీర్ణకోశ కణజాలాన్ని అంటిపెట్టుకుని అల్సర్‌ నుంచి జీర్ణాశయ క్యాన్సర్‌ దాకా..

గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!
Trending
Ravi Kiran
|

Updated on: Nov 09, 2024 | 9:16 PM

Share

అమ్మ చేతి గోరు ముద్ద.. బిడ్డలకు అమృతంతో సమానం! కానీ.. అది ఒకప్పటి మాట!! మనిషి జీర్ణకోశ కణజాలాన్ని అంటిపెట్టుకుని అల్సర్‌ నుంచి జీర్ణాశయ క్యాన్సర్‌ దాకా పలు వ్యాధులకు, సమస్యలకు కారణమవుతోంది హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా. ఇది శరీరంలో చేరడానికి అమ్మ చేతి గోరుముద్ద కూడా కారణమే అని.. దీనిపై విస్తృతస్థాయిలో పరిశోధనలు చేసి 2005వ సంవత్సరంలో నోబెల్‌ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ బారీ మార్షల్‌ తెలిపారు. హెచ్‌.పైలోరీ వల్ల కలిగే నష్టాలు ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఆ బ్యాక్టీరియాను తనకు తానే ఎక్కించుకుని, తన ఉదరాన్నే ప్రయోగశాలగా మార్చిన వ్యక్తి ఆయన!

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

‘హెచ్‌ పైలోరీ’ బ్యాక్టీరియాపై పరిశోధనల కోసం తొలిసారిగా ప్రత్యేక కేంద్రాన్ని హైదరాబాద్ లో నెలకొల్పారు. దీనిని బారీ మార్షల్ ప్రారంభించారు. ఈ సెంటర్ కు ‘బ్యారీ మార్షల్‌ సెంటర్‌’గా అని పేరు పెట్టారు. అపరిశుభ్రత, కలుషిత తాగునీరు తదితర కారణాలతో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందన్నారు. ఇంట్లో ఒకరికి సోకితే..మిగతా వారూ దీని బారినపడే ముప్పు ఉంది. ‘హెచ్‌ పైలోరీ’ సోకినప్పటికీ 80% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కొద్దిమందిలో మాత్రం అజీర్తి, పొట్టలో నొప్పి, గ్యాస్‌ తదితర ఇబ్బందులుంటాయి. ఒక శాతం మందిలో మాత్రమే దీర్ఘకాలంలో ఇది పొట్ట క్యాన్సర్‌కూ దారి తీసే ఛాన్సుంది. కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్‌ బారినపడిన చరిత్ర ఉంటే.. మిగతా సభ్యులు వెంటనే ఈ బ్యాక్టీరియా పరీక్షలు చేసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

‘హెచ్‌ పైలోరీ’పై ప్రత్యేక పరిశోధనల కోసం ప్రొఫెసర్‌ బ్యారీ మార్షల్‌ పేరుతో ప్రత్యేక కేంద్రం ఇప్పుడు హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ బ్యాక్టీరియాతో దేశ జనాభా పెద్ద సవాలును ఎదుర్కొంటోంది అంటున్నారు వైద్యనిపుణులు. కుటుంబంలో జీర్ణకోశ క్యాన్సర్లు, అల్సర్ల బారిన పడినవారు ఉంటే.. వారు శ్వాస పరీక్షలతో పాటుగా ఎండోస్కోపీ లాంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాక్టీరియా ఉంటే రెండు వారాల పాటు చికిత్సను తీసుకోవాలి. ఈ బ్యాక్టీరియా వ్యాప్తిని అడ్డుకునే మార్గాలు ప్రస్తుతానికి లేవు. అది ఎవరి ద్వారా అయినా, ఎలాగైనా మన జీర్ణకోశంలో చేరే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. పెద్దలలో ఈ బ్యాక్టీరియా కనబడితే టెట్రాసైక్లిన్స్‌ తరహా యాంటీ బయాటిక్‌ మందులను వాడాల్సి ఉంటుందన్నారు.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?