AP News: గాడిద పాలకు టైమొచ్చింది.. లీటర్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే రేటు.! మ్యాటర్ తెలిస్తే

సీన్‌ చూశారుగా..అచ్చం ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కొంతమందిని ముంచేశాడు..తమిళనాడులోని తిరునన్‌వేలికి చెందిన ఓ కేటుగాడు. సినిమాలో ఈము పక్షులో పేరుతో కోట్లు కొట్టేస్తే..ఇక్కడ మాత్రం గాడిదల ఫామ్‌ ఏర్పాటు చేస్తే కోట్లు వస్తాయని కొంతమందిని నమ్మించాడు.

AP News: గాడిద పాలకు టైమొచ్చింది.. లీటర్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే రేటు.! మ్యాటర్ తెలిస్తే
Telugu News
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 07, 2024 | 9:15 PM

సీన్‌ చూశారుగా..అచ్చం ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కొంతమందిని ముంచేశాడు..తమిళనాడులోని తిరునన్‌వేలికి చెందిన ఓ కేటుగాడు. సినిమాలో ఈము పక్షులో పేరుతో కోట్లు కొట్టేస్తే..ఇక్కడ మాత్రం గాడిదల ఫామ్‌ ఏర్పాటు చేస్తే కోట్లు వస్తాయని కొంతమందిని నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి పెట్టుబడి పేరుతో 90 లక్షల వరకు వసూలు చేసి పరారయ్యాడు. వాళ్లు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్‌ అవడంతో లబోదిబోమంటున్న బాధితులు.. ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెట్టుబడి పేరుతో 80 నుంచి వందకోట్లు వరకూ మోసపోయామని వాపోతున్నారు..గాడిదఫామ్‌ బాధితులు.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

“కడివెడైననేమి ఖరము పాలు..” అనేది ఎప్పుడో వేమన కాలం నాటి పాత మాట. గంగిగోవు పాలను మించిన డిమాండ్‌ ఇప్పుడు గాడిదపాలకు ఉంది. గ్రామాలతో పాటు నగరాల్లోనూ వీధుల వెంట తిరుగుతూ గాడిద పాలు అమ్మడం తరచూ కనిపించే దృశ్యమే. ఐదారు స్పూన్ల గాడిద పాలకు..మూడు వందల వరకూ వసూలు చేస్తుంటారు. ఆయాసం, ఉబ్బసం, జలుబు, దగ్గుకు గాడిదపాలు ఔషధంగా పనిచేస్తాయని కొంతమంది నమ్ముతుంటారు. అందుకే వీటికి అంత రేటన్నమాట.

ఇవి కూడా చదవండి

గాడిదపాలకు ఉన్న ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని అమాయకులను ముంచేస్తున్నారు..కేటుగాళ్లు. గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులనుంచి ఇటీవలే కోట్ల రూపాయలు కొట్టేశాడు ఏపీకి చెందిన ఓ కిలాడీ గాడు. సుమారు 200 మంది రైతుల నుంచి ఏకంగా రూ.9 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు.గాడిద పాల వ్యాపారం సంగతి అటుంచితే..లక్షల పోసి కొన్న గాడిదలను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు.

అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి అనే వ్యక్తి మూడు నెలల క్రితం జెన్నీ మిల్క్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. కర్ణాటకలోని హోస్పేట్‌లో హంగూ, ఆర్భాటాలతో గాడిద పాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. గాడిద పాల వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించవచ్చని చుట్టూ జనాన్ని నమ్మించాడు. అయితే ముందుగా తమ సంస్థకు డిపాజిట్‌ కింద రూ. 3లక్షలు చెల్లించాలని షరతు పెట్టాడు. డిపాజిట్‌ చేసిన వారికి మూడు గాడిదలు ఇస్తామని చెప్పాడు. వాటిని పెంచి, పోషించి పాలు పితికి ఇస్తే లీటర్‌కు రెండు వేల రూపాయలు చెల్లిస్తానని నమ్మబలికాడు. ఇది నిజమేనని నమ్మిన సుమారు 2వందల మంది రైతులు రూ. 3లక్షల చొప్పున సంస్థకు చెల్లించుకున్నారు. లక్షలు పోసి గాడిదలను తీసుకెళ్లారు.

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

లక్షలు పోసి కొన్న గాడిదలను దట్టంగా మేపిన యజమానులు..తమ నుంచి గాడిద పాలను కొనమని జెన్నీ మిల్క్‌ సంస్థను కోరటం మొదలు పెట్టారు. అయితే ఇదిగో అదిగో అంటూ దాని సంస్థ నిర్వాహకుడు కాలం వెళ్లదీయటం మొదలు పెట్టాడు తప్ప..ఏ ఒక్కరి నుంచి గ్లాస్‌ పాలు కూడా కొనలేదు. దీంతో ఎక్కడో తేడా కొట్టిందని అనుమానించిన ఓవ్యక్తి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు బండారం బయటపడింది. అధికారులు జరిపిన తనిఖీలో గాడిద పాల వ్యాపారానికి ఎలాంటి అనుమతులు లేవని బయటపడింది.దీంతో జెన్నీ మిల్క్‌ సంస్థ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు. అధికారులు సంస్థను మూసేయడంతో దాని నిర్వాహకుడు నూతలపాటి మురళి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

గాడిద పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాయని, ముఖ్యంగా పిల్లలు, ఆస్తమా బాధితులకు ఔషధంగా గాడిద పాలను ఉపయోగిస్తారని జెన్నీ మిల్క్‌ సంస్థ మాయమాటలెన్నో చెప్పింది. అంతేగాకుండా సబ్బులు, క్రీములు వంటి వస్తువుల తయారీలో కూడా గాడిద పాలను వినియోగిస్తారని నమ్మించినట్టు తెలిసింది. మూడు ఆడ గాడిదలు, మూడు మగ గాడిదలను ఒక యూనిట్‌గా పేర్కొన్నారు నిర్వాహకులు. చాలా మంది బాధితులు ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో..ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు కొన్నట్టు అధికారుల విచారణలో వెల్లడైంది. 20 నుంచి 30 వేల ధర కూడా పలుకని జత గాడిదలను లక్ష రూపాయలకు అంటగట్టాడని తెలుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. పదుల సంఖ్యలో ఉన్న గాడిదలను ఏం చేసుకోవాలో తెలీక దిక్కులు చూస్తున్నారు. గాడిద పాలకున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కోట్లు కొట్టేసిన కేటుగాడు రాత్రికే రాత్రే జంప్‌ అయితే..బాధితులు మాత్రం “పోయాం మోసం” అంటూ పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. మరి పరారైన ఆ అడ్డగాడిద పట్టుబడతాడో లేదో చూడాలి.

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓరి దేవుడా.! ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా..
ఓరి దేవుడా.! ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా..
ఒకదాని తర్వాతే ఒక్కటి పద్ధతి మారుస్తున్న ప్రభాస్‌! ప్లాన్ అదుర్స్
ఒకదాని తర్వాతే ఒక్కటి పద్ధతి మారుస్తున్న ప్రభాస్‌! ప్లాన్ అదుర్స్
ఆధారే అన్నింటికీ ఆధారం.. ఆధార్ లాకింగ్ అంటే తెలుసా?
ఆధారే అన్నింటికీ ఆధారం.. ఆధార్ లాకింగ్ అంటే తెలుసా?
కాల భైరవుడి జయంతి ఎప్పుడు శివపురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా
కాల భైరవుడి జయంతి ఎప్పుడు శివపురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా
మోడీ మెచ్చిన సినిమాకు పన్ను మినహాయింపు.. ఇంతకీ ఏముందీ మూవీలో..
మోడీ మెచ్చిన సినిమాకు పన్ను మినహాయింపు.. ఇంతకీ ఏముందీ మూవీలో..
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మరో వారంలో డీఎస్సీ కొత్త సిలబస్‌ విడుదల.. మంత్రి నారా లోకేశ్‌
మరో వారంలో డీఎస్సీ కొత్త సిలబస్‌ విడుదల.. మంత్రి నారా లోకేశ్‌
ఈ సీజన్‌లో లభించే సూపర్స్ ఫుడ్స్‌లో ఇది కూడా ఒకటి.. డోంట్ మిస్!
ఈ సీజన్‌లో లభించే సూపర్స్ ఫుడ్స్‌లో ఇది కూడా ఒకటి.. డోంట్ మిస్!
ఆమె పాట వింటే రక్తం మరగాల్సిందే..
ఆమె పాట వింటే రక్తం మరగాల్సిందే..
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో
భార్య విడాకులు.. ఎమోషనల్ అయిన రెహ్మాన్.! వీడియో
OGలో అఖీరా నందన్.. షూటింగ్ ఫినిష్ | వారిపై.. ఉపాసన సీరియస్.!
OGలో అఖీరా నందన్.. షూటింగ్ ఫినిష్ | వారిపై.. ఉపాసన సీరియస్.!