Viral Video: బాబోయ్.! పులితో పరాచకాలేంటి బాబాయ్.. చనువిస్తే యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే

అటవీ ప్రపంచంలో ఎన్నో క్రూర మృగాలు నివాసముంటున్నాయి. వాటికీ ఆకలి తీరాలంటే.. చిన్న జీవులు ప్రాణం ఇవ్వాల్సిందే. సింహం, పులి, చిరుత లాంటి వేటగాళ్లు తమ వేటను అత్యంత భయంకరంగా సాగిస్తాయి..

Viral Video: బాబోయ్.! పులితో పరాచకాలేంటి బాబాయ్.. చనువిస్తే యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే
Trending
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 06, 2024 | 6:29 PM

అడవి ప్రపంచంలో రూల్స్ చాలా డిఫెరెంట్‌గా ఉంటాయి. క్రూర మృగాల ఆకలి తీరాలంటే.. చిన్న ప్రాణులను వేటాడాల్సిందే. పులి, సింహం, చిరుత.. ఇవన్నీ హంటర్స్.. అత్యంత భయంకరంగా వేటాడతాయి. అడవిలోనైనా, జూలోనైనా పులిని చూస్తే భయపడాల్సిందే. అయితే ఈ మధ్యకాలంలో కొందరు ఓవర్‌నైట్ ఫేమ్ తెచ్చుకునేందుకు ఈ క్రూర మృగాలతో కూడా ప్రాణాంతక ఫీట్స్ చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో మండిపడుతున్నారు. మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

ఇవి కూడా చదవండి

మన ఇండియాతో సహా అనేక దేశాల్లో వన్యప్రాణులను ఇళ్లలలో ఉంచకూడదని పలు చట్టాలు ఉన్నాయి. ఇలాంటి చట్టాలు ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో క్రూర మృగాలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. ఈ విధంగా పాకిస్తానీ ఇన్‌ఫ్లుయెన్సర్ నౌమన్ హసన్ కూడా ఓ పులిని తన పెట్‌గా పెంచుతున్నాడు. దానితో తరచూ వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఇటీవల ఆ పులి నోట్లో చెయ్యి పెట్టి.. ‘మై టైగర్ రాకీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ’ అంటూ ఓ టైటిల్ పెట్టి ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశాడు. ఇక ఆ టైగర్ కూడా పిల్లి మాదిరిగా అతడి చేతితో ఆడుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ‘పులితో పరాచకాలు ఏంటి బాబాయ్’ అంటూ ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. ‘క్రూర జంతువులతో ఎప్పటికీ ప్రమాదమే’ అని మరొకరు కామెంట్ చేశారు.

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..