AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వు తోపురా బాబు.. భార్య, నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌ కళ్లుగప్పి ఒకే బిల్డింగ్‌లో కాపురం..!

ధనవంతుడిగా కనిపించడం కోసం ఆ డబ్బంతా ఖర్చు చేశాడు. తన భార్య నివసించే భవనంలోనే అద్దెకు ఫ్లాట్ తీసుకున్నాడు. ఇప్పుడు కొత్త గర్ల్ ఫ్రెండ్ కూడా గర్భం దాల్చడంతో ఆమెతో కలిసి జీవించడం మొదలుపెట్టాడు. అలా తన భార్య, కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటూ..అక్కడే నివసిస్తున్న మరో ముగ్గురు మహిళలను ట్రాప్ చేశాడు. వారి వద్ద కూడా లక్షల రూపాయలను కాజేస్తూ వచ్చాడు.

నువ్వు తోపురా బాబు.. భార్య, నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌ కళ్లుగప్పి ఒకే బిల్డింగ్‌లో కాపురం..!
Wife And His 4 Lovers
Jyothi Gadda
|

Updated on: Nov 06, 2024 | 6:00 PM

Share

ఓ వ్యక్తి తన భార్యతో పాటు మరో నలుగురు అమ్మాయిల్ని మోసం చేశాడు. అతడు తనకు తాను ఓ వ్యాపారి కొడుకుగా చెప్పుకుంటూ వాళ్లందిరినీ తన బుట్టలో వేసుకున్నాడు. కానీ, చివరకు అతని బండారం బయటపడింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, సదరు కేటుగాడు పెళ్లి చేసుకున్న మహిళ, డేటింగ్ చేసిన అమ్మాయిలందరూ చాలా కాలంగా ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఇదంతా నాలుగు సంవత్సరాలకు పైగా కొనసాగింది. అప్పటి వరకు ఒకరి ఉనికి మరొకరకి తెలియదు. ఇప్పుడు కథ వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. పూర్తివివరాల్లోకి వెళితే..

జియోజున్ అని పిలువబడే చైనాకు చెందిన ఓ వ్యక్తి జిలిన్ నివాసి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన అతను డబ్బు లేకపోవడంతో చదువును కూడా మధ్యలోనే వదిలేశాడు. అయితే, అతను ధనిక కుటుంబానికి చెందినవాడిగా తనను తాను అందరికీ పరిచయం చేసుకునేవాడు. తన గాలి కబుర్లు, బడాయి మాటలతో జియోజియా అనే అమ్మాయిని ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆమె గర్భవతి అయినప్పుడు వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కలిసి కాపురం మొదలు పెట్టారు.

పెళ్లి తరువాత జియాజున్ పేదవాడని తెలుసుకుంది జియోజియా. అతని తల్లి బాత్‌హౌస్‌లో పని చేస్తుందని, అతని తండ్రి ఏదో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. దాంతో తను మోసపోయాయని గ్రహించింది.. ఇక తన బిడ్డను తానే పెంచుకోవాలని నిర్ణయించుకుంటుంది. తనను మోసం చేసిన జియాజున్‌ను ఇంటి నుండి తరిమేసింది. అలా భార్య గెంటేసిన ఒక వారం తర్వాత ఆన్‌లైన్ గేమ్ ద్వారా మరో అమ్మాయిని కలుసుకున్నాడు. మళ్లీ మరో కొత్త కథ మొదలుపెట్టాడు.

ఇవి కూడా చదవండి

కొత్తగా పరిచయమైన మహిళ వద్ద 140,000 యువాన్లను (రూ. 16 లక్షలకు పైగా) అప్పుగా తీసుకున్నాడు. ధనవంతుడిగా కనిపించడం కోసం ఆ డబ్బంతా ఖర్చు చేశాడు. తన భార్య నివసించే భవనంలోనే అద్దెకు ఫ్లాట్ తీసుకున్నాడు. ఇప్పుడు కొత్త గర్ల్ ఫ్రెండ్ కూడా గర్భం దాల్చడంతో ఆమెతో కలిసి జీవించడం మొదలుపెట్టాడు. అలా తన మాజీ భార్య, కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటూ..అక్కడే నివసిస్తున్న మరో ముగ్గురు మహిళలను ట్రాప్ చేశాడు. వారి వద్ద కూడా లక్షల రూపాయలను కాజేస్తూ వచ్చాడు.

ఇదిలా ఉండగా, చివరకు ఒకరోజు అతని ఒక ప్రియురాలితో వాగ్వాదం జరిగింది. దాంతో వారి మధ్య దూరం పెరిగింది.. ఈ క్రమంలోనే ఆ మహిళ జియోజున్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి తొమ్మిదేళ్ల ఆరు నెలల జైలు శిక్ష, భారీ జరిమానా విధించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..