టపాసులు కాల్చడంలో కూడా టెక్నాలజీని వాడేశాడుగా
రోజు రోజుకూ టెక్నాలజీ పెరుగుతోంది. కొందరు దీనిని సద్వినియోగం చేసుకుంటే.. దుర్వినియోగం చేసేవాళ్లూ ఉంటారు. ఓ యువకుడు టెక్నాలజీని ఉపయోగించి దీపావళి టపాసులు కాల్చాడు. అవును, ఒడిశాకు చెందిన ఈ యువకుడు అమెజాన్ అలెక్సాను ఉపయోగించి దీపావళి రాకెట్‌ను ప్రయోగించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. మణీస్ ప్రాజెక్ట్ ల్యాబ్ అనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశాడు. అందులో అలెక్సావాయిస్ కమాండ్‌ను ఉపయోగించి దీపావళి రాకెట్‌ను ప్రయోగించాడు. ‘అలెక్సా, లాంచ్ ద రాకెట్’ అని మణి కమాండ్ ఇవ్వగానే.. డివైజ్ వెంటనే స్పందించింది. ‘యస్ బాస్. లాంచింగ్ ద రాకెట్’ అని బదులిచ్చింది. ఆ వెంటనే రాకెట్ అంటుకోవడం.. రయ్‌మంటూ ఆకాశంలోకి దూసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి. ‘లాంచింగ్ ద రాకెట్ విత్ అలెక్సా’ అని క్యాప్షన్ జోడించిన ఈ వీడియోను 23 మిలియన్ల మంది వీక్షించారు. ఆ ప్రాసెస్ ఏంటో తమకూ చెప్పాలంటూ యూజర్లు ప్రశ్నలతో హోరెత్తిస్తున్నారు. మైక్రో కంట్రోలర్ సాయంతో తానీ ప్రయోగం చేసినట్టు మణి వివరించాడు. అలెక్జా ద్వారా వాయిస్ కంట్రోల్‌ను ఎనేబుల్ చేసి దూరంగా ఉన్న రాకెట్‌ను లాంచ్ చేయొచ్చని పేర్కొన్నాడు. మణి ఈ ఏడాదే బీటెక్ పూర్తిచేశాడు. తాను ఫస్టియర్‌లో ఉన్నప్పుడే పలు ప్రాజెక్టులు చేపట్టడంతోపాటు ఇంటర్నెషిప్ కూడా పూర్తిచేసినట్టు తెలిపాడు. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నట్టు పేర్కొన్నాడు. ఇప్పుడు ఖాళీగా ఉండడంతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపికా-రణవీర్ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా ??
పొలంలో అరికెలు తిని 10 ఏనుగులు మృతి.. ఏం జరిగిందంటే ??
చనిపోయాడన్న వ్యక్తి.. పోస్ట్ మార్టం సమయంలో బతికే ఉన్నానంటూ కేక !!
Devara OTT: ఓటీటీలోకి ‘దేవర’ ఇట్స్ అఫీషియల్ నౌ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య, బాలకృష్ణ
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు
ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.

