దీపికా-రణవీర్‌ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా ??

దీపికా-రణవీర్‌ దంపతుల కుమార్తె పేరేంటో తెలుసా ??

Phani CH

|

Updated on: Nov 06, 2024 | 5:06 PM

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌వీర్ – దీపికా పదుకొణె దంపతులకు ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో పండంటి ఆడపిల్ల జన్మించింది. ఈ క్రమంలో దీపావళి పండుగను పురస్కరించుకుని తొలిసారి చిన్నారి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు రణ్‌వీర్ – దీపికా. అంతేకాదు తమ ముద్దుల తనయ పేరును కూడా ప్రకటించారు. దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసినట్లు తెలిపారు.

దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే’ ఈమె అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. క్యూట్ అంటూ లవ్ ఎమోజీలు జోడించారు. 2018లో రణ్‌వీర్ – దీపిక వివాహ బంధంతో ఒకటయ్యారు. కల్కి 2898 ఏడీతో అలరించిన దీపిక..సింగమ్ అగైన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఇందులో రణ్‌వీర్ అతిథి పాత్రలో సందడి చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొలంలో అరికెలు తిని 10 ఏనుగులు మృతి.. ఏం జరిగిందంటే ??

చనిపోయాడన్న వ్యక్తి.. పోస్ట్ మార్టం సమయంలో బతికే ఉన్నానంటూ కేక !!

Devara OTT: ఓటీటీలోకి ‘దేవర’ ఇట్స్ అఫీషియల్ నౌ

అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య, బాలకృష్ణ

సల్మాన్‌ను చంపేస్తాం.. మా గ్యాంగ్‌ యాక్టివ్‌గానే ఉంది