సల్మాన్‌ను చంపేస్తాం.. మా గ్యాంగ్ యాక్టివ్‌గానే ఉంది
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. కృష్ణ జింకల వేట విషయమై గతకొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుసగా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సల్మాన్‌కి ఇదే కోవలో మరో బెదిరింపు సందేశం వచ్చినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. అయితే, ఈసారి సల్మాన్‌కు ఆగంతుకులు రెండు ఆప్షన్స్ ఇచ్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
ప్రాణాలతో ఉండాలంటే క్షమాపణ చెప్పాలి లేదా రూ. 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, వారం వ్యవధిలో సల్మాన్ ఖాన్‌కు ఇది రెండో హత్య బెదిరింపు సందేశం కావడం గమనార్హం. ముంబయి పోలీసు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గత రాత్రి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో వాట్సప్‌లో బెదిరింపు సందేశం వచ్చినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు పేరిట ఈ మెసేజ్ వచ్చినట్లు తెలిపాయి. “సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే మా గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. అలా చేయకుంటే చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది” అని ట్రాఫిక్ కంట్రోల్ రూంకు సందేశం వచ్చినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఈ సందేశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గత నెల 30న కూడా ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఇదే విధమైన బెదిరింపు సందేశం వచ్చింది. అప్పుడు ఆగంతకులు రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చందమామపై ఎలా ఉంటుందో.. మన లద్ధాఖ్‌లో అలాగే ఉంటుందా ??
1930 ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే చాలు.. మీ అకౌంట్లో డబ్బులు సేఫ్ !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

