AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiki Hakansson: తొలి ప్రపంచ సుందరి కన్నుమూత.. మొదటిసారి బికినీలో పట్టాభిషేకం జరిగింది ఈమెకే..

అప్పట్లో అనేక దేశాలు ఆమెను పోటీ నుండి వైదొలగాలని బెదిరించాయి. ఈ క్రమంలోనే 1952లో పోటీ నుండి బికినీలు నిషేధించబడ్డాయి. అనంతరం స్వీమ్‌ డ్రస్‌లను అందుబాటులోకి తెచ్చారు. చివరికి బికినీలు మిస్ వరల్డ్‌కి తిరిగి వచ్చినప్పటికీ, మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని ధరించే సమయంలో బికినీ ధరించి హకాన్సన్ మాత్రమే విజేతగా నిలిచారు.

Kiki Hakansson: తొలి ప్రపంచ సుందరి కన్నుమూత.. మొదటిసారి బికినీలో పట్టాభిషేకం జరిగింది ఈమెకే..
Kiki Hakansson
Jyothi Gadda
|

Updated on: Nov 06, 2024 | 5:20 PM

Share

తొలి ప్రపంచ సుందరి ఇకలేరు..1951లో మొట్టమొదటి సారిగా ప్రపంచ సుందరి గుర్తింపు పొందిన ఆమె కన్నుమూశారు. స్వీడన్‌కు చెందిన కికీ హకాన్సన్ తన 95ఏళ్ల వయసులో కన్నుమూశారు. నవంబర్‌ 4 సోమవారం రోజున కాలిఫోర్నియాలోని తన స్వగృహంలో ఆమె మరణించారు. కికీ నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసిందంటూ ఆమె కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా, కికీ 1951లో మిస్ స్వీడన్ వరల్డ్ కిరీటం పొందిన తర్వాత మిస్ వరల్డ్ అందాల పోటీలో విజేతగా నిలిచిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.

1951 జులై 29న లండన్‌లోని లైసియం బాల్‌రూమ్‌లో మొట్టమొదటి సారిగా ప్రపంచ సుందరీ పోటీలు నిర్వహించారు. మొదట్లో ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్‌ కార్యక్రమంగా ప్రారంభించారు. ఆ రోజు మొదలైన ఈ పోటీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థగా ఎదుగుతుందని ఎవరికీ తెలియదు. కికీ విజయం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన అందాల పోటీల్లో ఒకటిగా మారడానికి వేదికను ఏర్పాటు చేసింది. అందం, సాంస్కృతిక ప్రకృతి దృశ్యాలు రెండింటిలోనూ ఆమె ఒక ఐకానిక్ ఫిగర్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

అప్పట్లో ఆమె టైటిల్ విన్నర్‌గా నిలవడమే కాదు..కిరీటం ధరించే సమయంలో బికినీ ధరించి వివాదానికి దారితీసింది. ఈ వస్త్రధారణ పోప్ నుండి తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొవాల్సి వచ్చింది. అప్పట్లో అనేక దేశాలు ఆమెను పోటీ నుండి వైదొలగాలని బెదిరించాయి. ఈ క్రమంలోనే 1952లో పోటీ నుండి బికినీలు నిషేధించబడ్డాయి. అనంతరం స్వీమ్‌ డ్రస్‌లను అంగీకరించారు. చివరికి బికినీలు మిస్ వరల్డ్‌కి తిరిగి వచ్చినప్పటికీ, మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని ధరించే సమయంలో బికినీ ధరించి హకాన్సన్ మాత్రమే విజేతగా నిలిచారు.

View this post on Instagram

A post shared by Miss World (@missworld)

కికీ హకాన్సన్ మరణంతో ఆమె కుమారుడు, క్రిస్ ఆండర్సన్ తన తల్లికి నివాళులర్పిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. “ఎప్పుడు ప్రేమతో సరదాగా గడిపే అమ్మ లేకపోవడం బాధ కలిగిస్తోంది. తన అద్భుతమైన హాస్యం, తెలివి మమల్ని ఎంతో ఉన్నత స్థాయిలో ఉంచాయి” అని గుర్తు చేసుకున్నాడు.

అలాగే 1960వ నుండి ప్రపంచ సుందరి పోటీలను నిర్వహిస్తున్న జూలియా మోర్లీ సైతం ఎమోషనల్ ట్వీట్ చేసింది. “కికీ హకాన్సన్ నిజమైన మార్గదర్శకురాలు.. ఈ క్లిష్ట సమయంలో మా ప్రేమను పంపుతూ, మా ప్రార్థనలను అందిస్తూ, కికీ కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము” అని జూలియా మోర్లీ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..