- Telugu News Photo Gallery Orange Peels Could Have Surprising Health Benefits For Your Heart, Cancer Disease
Orange Peels: తొక్కే కదా అని తీసి పారేయకండి..! ఇలా వాడితే క్యాన్సర్, గుండె జబ్బులు దరిచేరవు- నిపుణులు
వాతావరణం మారిన వెంటనే ప్రతి ఒక్కరూ బాధపడే అనారోగ్య సమస్య జలుబు, దగ్గు. చలి కాలంలో ఛాతీలో కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, జలుబు, ముక్కు కారటం వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ ఇబ్బందిపెడుతుంటాయి. మారుతున్న సీజన్లలో మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే నారింజ మీకు చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నారింజ పండ్లు తినడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. అయితే కేవలం నారింజ పండ్లే కాదు, ఆ పండ్ల తొక్కలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 06, 2024 | 4:37 PM

నారింజ పండు తొక్కలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నారింజ పండు తొక్కలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ వంటి గుణాలు కలిగి ఉంటాయి. నారింజ పండు తొక్కలతో ఒత్తిడి, మలబద్దకం తగ్గుతుంది. క్యాన్సర్, గుండె జబ్బుల దోహదపడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నారింజ పండు తొక్కను గాయాలు, ఇన్‌ఫెక్షన్‌కు గురైన శరీర భాగాలపై రాయటం వల్ల ఆయా సమస్యలు త్వరగా తగ్గుతాయి. నారింజ పండు తొక్కలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్లే గాయాలు, ఇన్‌ఫెక్షన్లు త్వరగా మానిపోతాయి.

క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు నారింజ పండు తొక్కలో ఉంటాయి. శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఆ తొక్కలోని పాలీమిథాక్సీఫ్లేవోన్స్ అనబడే ఫ్లేవనాయిడ్లలో ఉంటాయి. అందువల్ల నారింజ పండు తొక్కను ఏదో ఒక రూపంలో తీసుకుంటే క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.

నారింజ పండు తొక్కలో 61 నుంచి 69 శాతం వరకు ఫైబర్ ఉంటుంది. అందులో 19 నుంచి 22 శాతం వరకు సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో అవసరం. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ ఫైబర్ ఎంతగానో మేలు చేస్తుంది.

నారింజ పండు తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు, అల్జీమర్స్, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే, ఈ నారింజ తొక్కతో చర్మ సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. మొటిమల సమస్య ఉన్నవారు వాటిపై నారింజ పండు తొక్కలను నిత్యం మర్దనా చేస్తుంటే ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

ఆరెంజ్ తొక్కలో కూడా వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తొక్క లోపలి భాగంతో దంతాలను స్క్రబ్ చేయడం వల్ల పసుపుపచ్చ దంతాలు తెల్లగా మారుతాయి. ఇది పంటి ఎనామిల్‌కు మంచిది. అంతే కాకుండా నారింజ తొక్క కూడా సహజసిద్ధమైన క్రిమి సంహారిణి కావడంతో దాని వాసనకు క్రిములు కూడా రావు.





























