KA Movie: ‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఉందా.? ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే
మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుందంటూ 'క' సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఉందా.? రియల్ లైఫ్‌లో ఇలాంటి గ్రామాలు ఉంటాయా.? అనే ప్రశ్న సినిమా చూసిన చాలామందికి తలెత్తింది. వెంటనే గూగుల్ తల్లిని కూడా ఓ మాట అడిగేశారు. అయితే అలాంటి ఓ ఊరు ఉంది.? ఎక్కడో కాదు.. మన తెలంగాణలోనే..
‘క’ సినిమాలో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి అవుతుందని చూపించిన ఊరు నిజంగానే ఉంది.! తెలంగాణలోని పెద్దపల్లికి 10 కిమీ దూరంలో ఉన్న ఆ గ్రామాన్ని ‘మూడుజాముల కొదురుపాక’ అని పిలుస్తారు. ఈ ఊరిలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 జాములే ఉంటాయి. సాయంత్రం 4 గంటలకే అక్కడ చీకటి అవుతుంది. 4 దిక్కులా ఎత్తైన కొండలు, మధ్యలో ఊరు ఉండటంతో సూర్యుడు కొండల వెనక్కి వెళ్లి ఆ నీడ పడి త్వరగా ఆ గ్రామంలో చీకటి అవుతుంది. అలాగే ఈ గ్రామంలో సూర్యోదయం కూడా కాస్త ఆలస్యంగా జరుగుతుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.
ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్
మూడుజాముల కొదురుపాక గ్రామంలో ఉదయం 8 గంటలకు సూర్యోదయం, సాయంత్రం 4 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. ఎత్తైన పాము బండ గుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉండటం వల్ల ఆ కొండలు సూర్యరశ్మికి అడ్డం పడతాయి. ఇక ఈ ప్రకృతికి అలవాటుపడిన అక్కడి గ్రామస్తులు.. వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. సాయంత్రం నాలుగు తర్వాత లైట్లు వేసి.. పనులు సాగిస్తున్నారు. అలాగే ఆ ఊరికి కొత్తగా వెళ్లినవారు.. వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. కాగా, కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ‘క’ సినిమా మొదటి ఆట నుంచి హిట్ టాక్‌తో అదరగొడుతోంది. ఇప్పటివరకు ఏకంగా 19.41 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు సుజీత్, సందీప్ డైరెక్టర్లుగా వ్యవహరించారు.
ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి