మీ కళ్ల రంగు బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు.. ఎలాగో తెల్సా

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని పలు విషయాలు ఆధారంగా చెప్పేయొచ్చుట. అందులో ఒకటి కళ్లు. మన కళ్ల రంగుతో వ్యక్తిత్వం ఎలాంటిదో అంచనా వేయొచ్చు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..

మీ కళ్ల రంగు బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు.. ఎలాగో తెల్సా
Eyes
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 05, 2024 | 6:19 PM

శరీరంలోని ప్రతీ భాగంగా ఎంతో విలువైనది. వాటిల్లో ఒకటి మన కళ్లు. మనం చూసే ప్రతి విషయం బట్టి.. మన కళ్లల్లో భిన్నమైన భావోద్వేగం కనిపిస్తుంది. కళ్లతో మాట్లాడేవారు చాలామంది ఉంటారని మనకు తెలిసిందే. ఇక ఇదే కళ్లతో మన వ్యక్తిత్వం ఎలాంటిదో కూడా చెప్పేయొచ్చు. సాముద్రిక శాస్త్ర నిపుణులు కూడా ఇది నిజమేనని అంటున్నారు. కళ్ల రంగు ప్రతీ వ్యక్తికి విభిన్నంగా ఉంటుంది. చాలామంది కళ్ల రంగు నలుపుగా ఉంటే.. కొందరికి నీలం, లేత ఆకుపచ్చ, బూడిద.. ఇలా వివిధ రంగులు ఉంటాయి. మరి ఈ కళ్ల రంగు బట్టి మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్

బ్రౌన్ ఐస్:

ఈ వ్యక్తులు నిజాయితీగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ బెహివియర్ కూడా. వీరు చాలా అదృష్టవంతులు. జీవితంలో పేరు, డబ్బు, బంధం ఏదైనా కూడా సులభంగా సంపాదిస్తారు. ఈ వ్యక్తులు జీవితంలో ఏది కోరుకున్నా.. ఈజీగా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

నలుపు రంగు కళ్లు:

వీరిది కష్టపడి పని చేసే తత్త్వం. బాధ్యతాయుతంగా ఉండటమే కాదు.. పని ఎంత కష్టమైనా.. చేయడంలో ఒక అడుగు ముందుంటారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రెజెంట్‌లో జీవించే వ్యక్తిత్వం వీరిది.

లేత ఆకుపచ్చ కళ్లు:

ఈ వ్యక్తులు ఇతరులకన్నా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందంలోనే కాదు మేధస్సులోనూ వీరిని ఎవ్వరూ ఓడించలేరు. తమ తెలివితేటలతో ఇతరుల మెప్పు పొందుతారు.

నీలం రంగు కళ్లు:

ఈ వ్యక్తులు జీవితంలో ఉన్నత హోదా, ఎక్కువ డబ్బు, కీర్తిని పొందుతారు. కానీ ఈ వ్యక్తుల బలహీనత ఒకటే.. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల అనవసరమైన సమస్యల్లోకి పడి ఇబ్బందులు ఎదుర్కుంటారు.

గ్రే ఐస్:

ఈ వ్యక్తులు వ్యక్తిత్వం చాలా శక్తివంతమైనది. ఉద్వేగభరితంగా ఉంటారు కాబట్టి, చిన్న విషయాలకు కూడా బాధపడతారు. కానీ తమ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడే వ్యక్తిత్వం వీరికి ఉంది. ఈ వ్యక్తులలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..