AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడాళ్లా మజాకా.. వీళ్లకు ఏదైనా సాధ్యమే..! స్కూటీపై వెళ్తూ హెల్మెట్‌కు బదులు ఏం వాడిందో చూస్తే మైండ్ బ్లాక్..

ఈమె సూపర్‌ ఉమెన్‌ అంటూ ఒకరు ప్రశంసించగా, సాధారణ హెల్మెట్‌ కంటే బలమైంది ఇదే గురూ అంటూ మరొకరు వ్యాఖ్యనించారు. ఇది లెవల్ 3 హెల్మెట్ అంటూ మరొకరు పేర్కొన్నారు. మొత్తానికి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీ రియాక్షన్స్‌ ఇచ్చారు. లైకులు, షేర్లు చేస్తూ వీడియోను మరింతగా వైరల్‌గా మార్చేస్తున్నారు.

ఆడాళ్లా మజాకా.. వీళ్లకు ఏదైనా సాధ్యమే..! స్కూటీపై వెళ్తూ హెల్మెట్‌కు బదులు ఏం వాడిందో చూస్తే మైండ్ బ్లాక్..
Woman Riding A Scooter
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2024 | 7:00 PM

Share

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌పై అనేక రకాల వైరల్ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి వీడియోలు కనిపిస్తాయో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు ఫన్నీ వీడియో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు ప్రత్యేకమైన సందేశంతో కూడిన ఫోటో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ స్క్రీన్ షాట్ వైరల్ అవుతుంది. మరి కొన్నిసార్లు వివాహం కోసం వధూవరులు పెట్టే ప్రత్యేకమైన డిమాండ్‌కు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది. మొత్తంమీద విషయం ఏమిటంటే, మీరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎల్లప్పుడూ ఏదో ఒకటి వైరల్‌ కావడం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు.

laughwith_mm19 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వీడియోలో ఓ మహిళ స్కూటీ మీద ప్రయాణిస్తోంది. అయితే ఆమె తల మీద హెల్మెట్ లేదు. దానికి బదులుగా వంటింట్లో ఉపయోగించే ఓ సిల్వర్‌ గిన్నె బోర్లించుకుని వెళ్తోంది. హెల్మెట్‌కు బదులుగా ఆమె ఆ గిన్నె పెట్టుకుని బయటకు వచ్చేసింది. తలపై గిన్నె బోర్లించుకుని వెళ్తున్న ఆమెను చూసిన ఓ వ్యక్తి ఆశ్చర్యపోయి వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా, ఇప్పుడా వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియోను ఇప్పటివరకు 30 లక్షల కంటే ఎక్కువ మంది చూవారు. 3.3 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె సూపర్‌ ఉమెన్‌ అంటూ ఒకరు ప్రశంసించగా, సాధారణ హెల్మెట్‌ కంటే బలమైంది ఇదే గురూ అంటూ మరొకరు వ్యాఖ్యనించారు. ఇది లెవల్ 3 హెల్మెట్ అంటూ మరొకరు పేర్కొన్నారు. మొత్తానికి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీ రియాక్షన్స్‌ ఇచ్చారు. లైకులు, షేర్లు చేస్తూ వీడియోను మరింతగా వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..