Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు బొక్కబోర్లా పడ్డారు..

ఎవరైనా సరే రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు చుట్టు పక్కల వెళ్తున్న వాహనాలు, ఇతర జంతువులు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే, ఇలాంటి ప్రమాదాలు తప్పవు. ఇక్కడ కూడా ఇద్దరు యవతులు స్కూటిపై వెళ్తుండగా రోడ్డుపై వెళ్తున్న ఓ గుర్రం.. సడన్‌ షాక్ ఇచ్చింది.

Watch: వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు బొక్కబోర్లా పడ్డారు..
Scooter Girls close pass horse
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2024 | 5:30 PM

Viral Video: ప్రతి నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటివి వీడియోలు అందరినీ నవ్వించే విధంగా ఉంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే లక్షల్లో వ్యూస్‌తో నెటిజన్లను కట్టిపడేస్తుంటాయి. అయితే తాజాగా ఓ ఫన్నీ వీడియోకు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యువతులు కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా ఓ గుర్రం వారిని ఈడ్చితన్నింది. దీంతో బైక్‌సహా ఇద్దరు బొక్కబోర్లా పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది.

ఈ రోజుల్లో అమ్మాయిలు బైకులు, కార్లు, రైళ్లు, విమానాలు కూడా నడుపుతున్నారు. అయితే, ఎవరైనా సరే రోడ్డుపై వాహనం నడుపుతున్నప్పుడు చుట్టు పక్కల వెళ్తున్న వాహనాలు, ఇతర జంతువులు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే, ఇలాంటి ప్రమాదాలు తప్పవు. ఇక్కడ కూడా ఇద్దరు యవతులు స్కూటిపై వెళ్తుండగా రోడ్డుపై వెళ్తున్న ఓ గుర్రం.. సడన్‌ షాక్ ఇచ్చింది. దాంతో వారిద్దరికీ చావు తప్పి ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇవి కూడా చదవండి

@viral_ka_tadka Instagramలో షేర్ చేసిన ఈ వీడియోలో, ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై ఫుల్ స్పీడ్‌గా వెళ్తున్నారు. వారి స్కూటీ ముందు ఓ వ్యక్తి గుర్రంపై వెళ్తున్నాడు. అలా ఆ అమ్మాయిలు వెళ్తున్న స్కూటీ గుర్రం దగ్గరగా వచ్చింది.. అంతే.. ఊహించని విధంగా ఆ గుర్రానికి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు గానీ, ఒక్కసారిగా ఈడ్చి తన్నేసింది. దాంతో ఆ ఇద్దరమ్మాయిలు అమాంతంగా కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడి స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. యువతులు కిందపడడంతో ఆ గుర్రంపై వెళ్తున్న యువకుడు ఆగకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో యువతులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇదంతా ఎవరో రికార్డ్‌ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన చాలా మంది భిన్నమైన కామెంట్లు చేశారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఇలాంటి జంతువులకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. వాహనాల శబ్ధాల కారణంగా జంతువులు వాటికి ఏదో అపాయం ఉందని భావిస్తాయి.. దాంతో తమను తాము రక్షించుకోవటం కోసం ఇలా ఇతరులపై దాడి చేస్తాయని అంటున్నారు. రోడ్డు భద్రత విషయంలో ఇది అందరికీ ఒక గుణపాఠం అంటున్నారు మరికొందరు నెటిజన్లు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..