Viral News: బామ్మ నుదిటిపై కొమ్ము.. రోజు రోజుకీ పెరుగుతూ వైద్యులకు షాక్..

ఓ వృద్ధ మహిళ తలపై జంతువుకు వచ్చినట్లు కొమ్ము వచ్చింది. ఇది చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ బామ్మ నుదురు ఫోటో వైరల్ అయింది. ఈ కొమ్ములో అద్భుత లక్షణాలు ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారు. అంతేకాదు ఇది ఆ వృద్ధురాలి పెరుగుతున్న వయస్సు వెనుక రహస్యం అని భావిస్తున్నారు. ప్రజలు దీనిని 'దీర్ఘాయువు కొమ్ము' అని పిలుస్తున్నారు.

Viral News: బామ్మ నుదిటిపై కొమ్ము.. రోజు రోజుకీ పెరుగుతూ వైద్యులకు షాక్..
Horn Woman Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Nov 05, 2024 | 1:35 PM

చైనాకు చెందిన 107 ఏళ్ల వృద్ధురాలు తన నుదుటిపై పెరిగిన వింత కొమ్మును చూపిస్తూ సోషల్ మీడియా వినియోగదారులను షాక్‌కు గురి చేసింది. చెన్ అనే ఈ వృద్ధ మహిళ చైనా సోషల్ సైట్ డౌయిన్‌లో సంచలనంగా మారింది. చెన్ నుదుటిన పెరిగే ఈ కొమ్ములో అద్భుత లక్షణాలు ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ఆమె దీర్ఘాయుస్సు వెనుక రహస్యం అని భావిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ బామ్మ కొమ్ముని ‘దీర్ఘాయువు కొమ్ము’ అని పిలుస్తున్నారు.

న్యూయార్క్ పోస్ట్‌లో ప్రచురించబడిన వార్త ప్రకారం..107 ఏళ్ల చెన్ సుదీర్ఘ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. వందేళ్లు దాటినా ఇప్పటికీ చెన్ మంచి ఆరోగ్యంతో ఉంది. ఇప్పటికీ బామ్మకు మంచి ఆకలి ఉందని, ఉల్లాసంగా ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం బామ్మ నుదుటిపై పెరిగిన నాలుగు అంగుళాల కొమ్మే ఆరోగ్యంగా ఉండడానికి కారణం అని నమ్ముతున్నారు.

బామ్మ నుదిటి మీద ఉన్న కొమ్ముని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడానికి ప్రయత్నించకూడదని ఒక నెటిజన్ హెచ్చరించాడు. ఎందుకంటే తన అమ్మమ్మ నుదిటిపై ఇలాంటి కొమ్ము ఉండేది.. ఆ కొమ్ముని ఆపరేషన్ చేసి తీసివేసిన కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించిందని పేర్కొన్నాడు. అదే సమయంలో మరి కొందరు వృద్ధురాలి కొమ్ముకు ఎలాంటి మాయా లక్షణాలు లేవు..అంతే కాదు ఆ కొమ్ము వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మీడియా నివేదికల ప్రకారం ఈ కొమ్ము క్రమంగా వృద్ధ మహిళ నుదిటిపై పెరుగుతూ వచ్చింది. ఇలాంటి కేసులు అరుదుగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే దీని వల్ల పేషెంట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా చెబుతున్నారు. అదే సమయంలో చెన్ తన కొమ్మును తొలగించే ఆలోచన కూడా లేదని చెబుతున్నారు.

చర్మవ్యాధి నిపుణులు ఈ విషయంపై మాట్లాడుతూ ఇలా నుదుటి మీద కొమ్ము ‘కటానియస్ హార్న్స్’ అనే అరుదైన చర్మవ్యాధి వల్ల వస్తుందని భావిస్తున్నారు. దీని కారణంగా బాధితుడి నుదిటిపై కోన్ ఆకారంలో నిర్మాణం ప్రారంభమవుతుంది. ఇటువంటి సమస్య 60 నుండి 70 సంవత్సరాల వయస్సు గల రోగులలో సర్వసాధారణం. అయితే ఈ కొమ్ము వలన ఎటువంటి ఆరోగ్య ప్రమాదాన్ని కలిగించదు.

అయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని విస్మరించలేమని వైద్యులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కొమ్ము ఆకారం, రంగులో వేగంగా మార్పు వచ్చినప్పుడు చెన్ విషయంలో కనిపించింది. ఎందుకంటే ఇటీవల వృద్దురాలి నుదిటి కొమ్ము పరిమాణం రెండింతలు పెరిగిందని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..