AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagula Chavithi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు.. పుట్టల వద్ద బారులు తీరిన భక్తులు

దేశంలో ఉన్న పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుని శివ భావంతో పూజిస్తే సంతానం కలుగుతుందని.. సర్వరోగాలు పోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని భారతీయుల నమ్మకం. ఈ నేపధ్యంలో ఈ రోజు నాగుల చవితి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పుట్టలో పాలు పోయటానికి ఉదయం నుండి బారులు తీరారు.

Nagula Chavithi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు.. పుట్టల వద్ద బారులు తీరిన భక్తులు
Nagula Chavithi
Surya Kala
|

Updated on: Nov 05, 2024 | 11:34 AM

Share

కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగగా జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి పూజలను చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది. కనుక చెట్టును, పుట్టను, రాయిని, నదులను, పశు పక్ష్యాదుల సహా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా భావించి పూజిస్తారు. అందులో భాగంగానే నాగుపామును నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తారు. నాగుల చవితికి పుట్టకు నూలు చుట్టి పూజ లు చేస్తారు.

పట్టణం, పల్లెలు అనే తేడా లేకుండా నాగు పాము పుట్టల వద్ద స్థానిక దేవాలయాల వద్ద సుబ్రహ్మణ్య స్వామీ ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. పలు శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వద్ద నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోయటానికి ఉదయం నుండి బారులు తీరారు. పుట్టకు పూజలు చేసి పాలు పోసి తమని చల్లా చూడమంటూ నాగదేవతను వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నాగుల చవితి వేడుకలు మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక మాసం నాగుల చవితి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి తెల్లవారుజాము నుండే పుట్టలో పాలు పోసేందుకు మహిళలు తరలివచ్చారు. నాగదేవత విగ్రహంపై పాలు పోసి, మొక్కలు చెల్లించుకుంటున్నారు. పుట్టపై దీపం వెలిగించి, పూలు, పండ్లు పెట్టి నాగేంద్రుడి కృపాకటాక్షాలు తమపై ఉండాలని పుట్ట మట్టి బొట్టు పెట్టుకొని పూజలు నిర్వహించారు భక్తులు.

పలు జిల్లాలోని ప్రజలు తెల్లవారు జామునుండే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సిద్దేశ్వరాలయం, వేయి స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నాగేంద్ర స్వామిని దర్శించుకుని పుట్టలో పాలు పోసి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు మహిళ భక్తులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..