Viral Video: జనరల్ కంపార్ట్‌మెంట్‌లో తన కోసం సీటును ఏర్పాటు చేసుకున్న ప్రయాణీకుడు.. ఆకట్టుకున్న వీడియో

మనదేశంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి అత్యధికంగా వినియోగించే ప్రయాణ సాధనం రైలు. సామాన్యులకు అందుబాటులో ఉండే రైలు ప్రయాణం అదొక అందమైన అనుభూతిని ఇస్తుంది. అయితే ఈ రైలు ప్రయాణం చేసే సమయంలో తమ ప్రయాణ కష్టాల గురించి ప్రజలు నిరంతరం భారతీయ రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకపోవడం ఆసక్తికరంగా మారింది. స్థానిక కంపార్ట్‌మెంట్ జామ్‌ల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కూర్చోవడానికి లేదా నిలబడటానికి స్థలం లేకపోవడంతో.. ఒక ప్రయాణికుడు చేసిన పనిని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

Viral Video: జనరల్ కంపార్ట్‌మెంట్‌లో తన కోసం సీటును ఏర్పాటు చేసుకున్న ప్రయాణీకుడు.. ఆకట్టుకున్న వీడియో
Train Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Nov 05, 2024 | 12:22 PM

భారతదేశంలో ఎక్కువ మంది ఉపయోగించే ప్రయాణ సదనం రైలు. అయితే ఈ రైలు ప్రయాణాలు ఎప్పుడూ కష్టతరమే. ఈ ప్రయాణాలు కష్టతరంగా మారడానికి ప్రధాన కారణం జనరల్ కోచ్‌లు ఎక్కువగా లేకపోవడమే. చాలా రైళ్లలోని జనరల్ కంపార్ట్‌మెంట్లలో హాయిగా కూర్చోవడం మాట అటు ఉంచి.. కనీసం నిల్చోవడానికి కూడా సాధ్యం కాదు. అయితే భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే అనేక రైళ్లలో జనరల్ కోచ్‌లను తగ్గించారు. మరోవైపు ప్రీమియం కోచ్‌లను పెంచారు. దీని వలన రైలులో ప్రయాణించే ప్రయాణీకులకు ప్రయాణం ఓ సవాలుగా మారింది.

ప్రయాణ కష్టాలపై ప్రజలు నిత్యం ఫిర్యాదులు చేస్తున్నా భారతీయ రైల్వే ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించకపోవడం విశేషం. రైల్వే కంపార్ట్‌మెంట్ లకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. జనరల్ కోచ్ ల్లో కూర్చోవడానికి లేదా నిలబడటానికి స్థలం లేకపోవడంతో.. ఒక ప్రయాణికుడు చేసిన పనిపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.

ఇవి కూడా చదవండి

లోకల్ కోచ్ లో స్థలం సరిపోకపోవడంతో తానే బెర్త్ ను తయారు చేసుకున్నాడు ఓ ప్రయాణీకుడు. రెండు సీట్ల మధ్య ఖాళీ స్థలంలో బెర్త్ వేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా కార్యకర్త ప్రియా సింగ్ ఈ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. పరిమిత సౌకర్యాలలో కొత్త ఆవిష్కరణలు చేసే దేశం భారతదేశం అనే క్యాప్షన్‌తో ప్రియ సింగ్ ఈ వీడియోను షేర్ చేసింది.

ప్రియా సింగ్ షేర్ చేసిన వీడియో

రైలులోని రెండు బెర్త్‌ల మధ్య ఖాళీలో ఓ తాడుని తీసుకుని నులక మంచం అల్లినట్లు అల్లుతూ.. తన కోసం ఒక సీటుని తయారు చేసుకున్నాడు. తన కోసం సీటును సిద్ధం చేసుకుంటున్న వీడియో ప్రయాణీకులను ఆకట్టుకుంటుంది. వైరల్ వీడియోలో రైలులో ప్రయాణీకులు కూడా అతని పనిని చూస్తున్నారు. సీటును తాడుతో ఏర్పాటు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం ఇదే తొలిసారి. ఊయలపై కూర్చున్న వ్యక్తులు, చీరలుతో ఊయల వంటి రకరకాల వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..