Tragic Video: రీల్స్ మోజులో కన్న కూతుర్ని ‘గంగ’లో వదిలేసిన తల్లి.. నీళ్లలో కొట్టుకుపోయి ఐదేళ్ల చిన్నారి మృతి! వీడియో

రీల్స్ మోజులో ఓ తల్లి సరిదిద్దుకోలేని తప్పు చేసింది. కార్తీక సోమవారం నాడు పుణ్య స్నానాలకు వెళ్లిన ఆమె నదిలో స్నానం చేస్తూ రీల్స్ కు ఫోజులిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమెతో పాటు నీళ్లలోకి తీసుకెళ్లిన ఐదేళ్ల చిన్నారిని వదిలేసింది. అంతా రీల్స్ చేస్తూ బిజీగా ఉండటంతో చిన్నారి నీళ్లలో కొట్టుకుపోయింది..

Tragic Video: రీల్స్ మోజులో కన్న కూతుర్ని 'గంగ'లో వదిలేసిన తల్లి.. నీళ్లలో కొట్టుకుపోయి ఐదేళ్ల చిన్నారి మృతి! వీడియో
4 Yr Old Girl Drowns In Ganga
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 05, 2024 | 11:11 AM

ఘాజీపూర్‌, నవంబర్ 5: కార్తీక సోమవారం పురస్కరించుకుని గంగా నదిలో పుణ్య స్నానాలకు వెళ్లిన ఓ కుటుంబం నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల చిన్నారి నీట మునిగి మృతి చెందింది. నీళ్లలో మునుగుతూ తల్లి ఇన్‌స్టా రీల్స్‌కు ఫోజులిస్తూ.. పక్కనే ఉన్న చిన్నారిని నీళ్లలో వదిలేసిందా తల్లి. దీంతో చిన్నారి నీళ్లలో కొట్టుకుపోయింది. కాసేపటి తర్వాత చూస్తే చిన్నారి కనిపించలేదు. 2 గంటల తర్వాత బాలిక మృత దేహం లభ్యమైంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో సోమవారం (నవంబర్ 4) చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని చౌబేపూర్ ప్రాంతంలోని ఉమర్హా గ్రామానికి చెందిన అంకిత అనే వివాహిత తన ఐదేళ్ల కుమార్తె తాన్యతో కలిసి సైద్‌పూర్‌లోని బౌర్వాన్ గ్రామంలోని తన పుట్టింటికి వచ్చింది. కార్తీక మాసం సందర్భంగా ఛత్ పూజ జరుపుకోవడానికి అత్తింటి నుంచి వచ్చింది. నిన్న కార్తీక సోమవారం కావడంతో తాన్య, తన తల్లి, అమ్మమ్మ, ఆమె అత్త స్మృతితో సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానాలు ఆచరించేందుకు గంగా నది వద్దకు వెళ్లారు. వారిలో స్మృతి నది ఒడ్డున నిలబడి ఉండగా.. మిగతా కుటుంబం అంతా నీటిలోకి దిగి స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే నది ఒడ్డున ఉన్న స్మృతి నీళ్లలో స్నానం చేస్తున్న వారిని ఇన్‌స్టాగ్రామ్ రీల్ రికార్డు చేస్తోంది. ఆమె రికార్డింగ్‌పై దృష్టి కేంద్రీకరించిన అంకిత.. తనతోపాటు నీళ్లలోకి తీసుకువెళ్లిన తాన్యను మరచిపోయింది. దీంతో తాన్య లోతైన నీళ్లలోకి వెళ్లిపోయి, కాసేపటికే నీళ్లలో కొట్టుకుపోయింది. ఈ దృశ్యాలు కూడా స్మృతి రికార్డు చేస్తున్న వీడియోలో ఉన్నాయి. అయితే చిత్రీకరణలో నిమగ్నమై ఉన్న స్మృతి తాన్య మునిగిపోవడాన్ని గమనించలేదు.

ఇవి కూడా చదవండి

కాసేపటి తర్వాత చిన్నారి తాన్య కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలో స్మృతి రికార్డ్ చేసిన వీడియోను పరిశీలించగా.. అందులో తాన్య అదృశ్యమైన దృశ్యాలు కనిపించాయి. ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయడంతో పోలీసులు, డైవర్ల సహాయంతో సోదాలు నిర్వహించారు. సుమారు గంటన్నర తర్వాత తాన్య మృతదేహం సుమారు 50 మీటర్ల దిగువన లభ్యమైంది. తాన్యాను సైద్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా.. అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిమిత్తం సైద్‌పూర్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.