Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajwain Water: రాత్రి పడుకునే ముందు వాము నీటిని తాగితే ఇన్ని లాభాలా.. ? శరీరంలో ఏమవుతుందంటే..

వాము..ఈ విత్తనాలు చూసేందుకు చాలా చిన్నగా ఉంటాయి. కానీ, ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు మాత్రం చాలా పవర్‌ ఫుల్‌ అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. మనం రోజువారీ ఎదుర్కొనే అనేక సమస్యలకు వాముతో చెక్ పెట్టవచ్చునని చెబుతున్నారు. సీజన్ మారుతున్నప్పుడు ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు సమస్యలను వాముతో వదిలించుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు వాముని తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, అది ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Nov 05, 2024 | 3:51 PM

వామును మెత్తటి పౌడర్‌గా చేసుకుని నిల్వ చేసుకోవాలి. పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నవారు.. అర టీ స్పూన్‌ వాము పౌడర్‌, కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌, గోరువెచ్చని నీటితో కలిపి తాగితే, పంటి నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాదు..నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది.

1 / 5
గోరువెచ్చని నీటిలో వాము పౌడర్‌ కలిపి తాగడం వల్ల నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే తిమ్మిర్లు, కడుపు నొప్పిని దూరం చేస్తుంది. పొత్తి కడుపు తగ్గుతుంది. ఇలా క్రమంగా వాము వాటర్‌ తాగుతూ ఉంటే.. బరువు కూడా తగ్గుతారు. ఇందుకోసం వాము పొడి లేదంటే, వాముని నేరుగా కూడా తీసుకోవచ్చు.

2 / 5
వాములో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శ్వాస కోస వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒక వేళ జలుబు, దగ్గు, కఫం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ నీటిని తాగడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి.

3 / 5
రాత్రి పడుకునే ముందు ఇలా గోరువెచ్చని నీటిలో వాము పౌడర్‌ని కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా కడుపు ఉబ్బరం, త్రేన్పులు, జీర్ణ సమస్యల్ని దూరం చేయడంలో ఈ వాము వాటర్ బాగా హెల్ప్ చేస్తాయి. వాముని కప్పున్నర నీటిలో వేసి మరిగించి కప్పు అయ్యే వరకూ ఉంచాలి. దీనిని ఫిల్టర్ చేసి రెగ్యులర్‌గా తీసుకుంటే బరువు తగ్గుతారు.

4 / 5
పిల్లలకు అరుగుదల సరిగ్గా లేకపోయినా, పెద్దలు గ్యాస్‌ లాంటి వాటితో బాధ పడుతున్నా వాము ఔషధంగా పనిచేస్తుంది. వాముతో జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. (గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని TV9 Telugu.com (టీవీ9 తెలుగు) ధృవీకరించడం లేదు.)

5 / 5
Follow us