- Telugu News Photo Gallery Cinema photos Young directors are connecting their stories and creating Cinematic Universe
Cinematic Universe: నవశకానికి నాంది.. కొత్త ప్రపంచాలతో యంగ్ డైరెక్టర్స్ మ్యాజిక్..
ప్రజెంట్ బిగ్ స్క్రీన్ మీద సినిమాటిక్ యూనివర్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. యంగ్ డైరెక్టర్స్ తమ కథలను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తూ కొత్త ప్రపంచాలు సృష్టిస్తున్నారు. ఫాంటసీ, యాక్షన్, డివోషనల్ జానర్ ఏదైనా ప్రతీ కథకు కొనసాగింపు ఉండేలా చూసుకుంటున్నారు.
Updated on: Nov 05, 2024 | 4:20 PM

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ, తన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీపావళి సందర్భంగా తన యూనివర్స్ నుంచి 7వ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

హనుమాన్ సినిమా క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చిన జై హనుమాన్‌కు సంబంధించి బిగ్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. సినిమా బ్యాక్ డ్రాప్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చారు. సినిమా నేపథ్యంతో పాటు హనుమాన్‌గా కనిపించబోయే ఆర్టిస్ట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ నటుడు రిషబ్ శెట్టి, జై హనుమాన్‌లో టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు.

జై హనుమాన్‌తో పాటు అధీరా, మహాకాళి, బాలయ్య తనయుడు మెక్షజ్ఞ డెబ్యూ మూవీలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా తన యూనివర్స్‌ను మరింతగా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. ఖైదీ సినిమాతో మొదలైన ఎల్‌సీయులో తరువాత విక్రమ్, లియో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలన్నింటినీ కలుపుతూ ఓ షార్ట్ ఫిలిం సిద్ధం చేస్తున్నారు లోకేష్.

ప్రజెంట్ సెట్స్ మీద కూలీతో పాటు ఖైదీ 2, రోలెక్స్ సినిమాలను కూడా లారెన్స్ లీడ్ రోల్‌లో బెంజ్ మూవీని కూడా ఎల్‌సీయులో భాగంగానే సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎల్‌సీయు హీరోలందరినీ ఒకే సినిమాలో చూపించాలన్నది తన కల అంటున్నారు లోకేష్ కనగరాజ్.





























