- Telugu News Photo Gallery Cinema photos Guess The Actress in This Photo She Is Heroine Rukmini Vasanth Throwback Photo
Tollywood: టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. బాక్సాఫీస్ షేక్ చేసిన హీరోయిన్.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువగా కన్నడ హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆ హీరోయిన్ త్రోబ్యాక్ పిక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ?
Updated on: Nov 05, 2024 | 8:35 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఆ అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో ఆఫర్స్ అందుకుంటుంది. తనే హీరోయిన్ రుక్మిణి వసంత్.

కన్నడ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ రుక్మిణీ వసంత్. ఈ మూవీతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగులో నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీలో నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ పోస్టర్, ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మరోవైపు కన్నడలో శ్రీమురళి జోడిగా బఘీర సినిమాలో నటించింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

అలాగే ఈ అమ్మడు తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ అందుకుందని వార్తలు వచ్చాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఓ ప్రాజెక్టులో తారక్ జోడిగా ఈ బ్యూటీ కనిపించనుందని వార్తలు రాగా.. వాటిపై క్లారిటీ ఇచ్చింది రుక్మిణీ వసంత్.

తన గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. అవి నిజమో కాదో ఆయా నిర్మాణ సంస్థలను అడగాలని చెప్పింది. ప్రస్తుతానికి తాను తెలుగులో కథలు వింటున్నానని.. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్ జోడిగా ఓ సినిమా చేసినట్లు చెప్పుకొచ్చింది.





























