Banana Face Pack: అరటిపండుతో అందం.. ఇలా వాడితే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం..!

అరటి పండు..అందరికీ అందుబాటులో ఉండే అద్భుత ఫలం..ఎంతో రుచికరంగా ఉండే ఈ అరటిపండులో పోషకాలు సైతం బోలెడు ఉన్నాయి. అయితే అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే, కాదు.. అందానికి కాకుండా దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అరటి పండులో ఉండే పోషకాలు చర్మాని కాంతివంతంగా మార్చుతాయి. అరటిపండులో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా నిండివున్నాయి. దీంతో ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేసుకుంటే.. చర్మానికి మంచి నిగారింపునిస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి.

Jyothi Gadda

|

Updated on: Nov 05, 2024 | 4:33 PM

అరటి పండులో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అరటి పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీరాడిక్స్‌ నుంచి రక్షిస్తుంది. అరటి పండులోని ఎంజైమ్‌లు చర్మంపై మృత కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

1 / 7
అరటి పండులో ఉండే పోటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అరటి పండులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను, చర్మ వాపులను తగ్గిస్తాయి. ఇందుకోసం వారానికి రెండు సార్లు అరటిపండుతో తయారు చేసే ఫేస్ ప్యాక్‌ ను ఉపయోగించడం చాలా రెట్టింపు అందాన్ని సొంతం చేసుకోవచ్చునని చర్మనిపుణులు చెబుతున్నారు.

2 / 7
అరటి పండు ఫేస్‌ ప్యాక్‌ కోసం అరటి పండును తీసుకొని మెత్తగా చేసి ఒక చెంచా తేనెను కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూర్తిగా అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా అరటిపండుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మెరిసేలా చేస్తుంది. చర్మం పొడిబారకుండా చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

3 / 7
అరటి పండుతో చేసే మరో ఫేస్‌ ప్యాక్‌లో ఒక అరటి పండును మెత్తగా చేసి రెండు చెంచాల పెరుగును కలిపి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు, మరకలు తొలుగుతాయి. చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది.

4 / 7
నిమ్మరసం చర్మ సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని అరటిపండుతో కలిపి తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ ఫేస్‌ప్యాక్‌ తయారీ కోసం అరటి పండులో  నిమ్మరసం కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి సుమారు 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసుకోవడం వల్ల మీ ముఖం మెరిసిపోవటం ఖాయం అంటున్నారు నిపుణులు.

5 / 7
అరటి పండు, అవోకాడోతో కూడా ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ అవోకాడో కూడా ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని అరటిపండుతో కలిపి వాడటం వల్ల చర్మం తేమగా ఉంచుతుంది. దీని తయారు చేసుకోవడం కోసం అరటి పండు, అవోకాడోను మెత్తగా చేసి, రెండింటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం మొత్తం అప్లై చేసి 20-25 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

6 / 7
మీరు ఎలాంటి ఫేస్ ప్యాక్ వేయాలన్నా ముందు చిన్న భాగంలో టెస్ట్ చేసి చూడాలి. టేస్ట్ చేసి తరువాత అలర్జీ ఉంటే వాడకూడదు. వారానికి 2-3 సార్లు ఈ ఫేస్ ప్యాక్‌లు వేయవచ్చు. ఇకపోతే, (గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని TV9 Telugu.com (టీవీ9 తెలుగు) ధృవీకరించడం లేదు.)

7 / 7
Follow us