కారు డోర్‌ లాక్‌.. ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి..

కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి దండ్రులకు పిల్లలు కనిపించలేదు. స్థానికుల సాయంతో చుట్టుపక్కల వెతకగా కారులో మృతి చెంది కనిపించారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు బాలురు, బాలికలు ఉన్నారు.

Children Die Car Door Locked
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 04, 2024 | 9:37 PM

ఆడుకుంటూ కారులోకి లాక్కెళ్లి నలుగురు చిన్నారులు ఊపిరాడక మరణించిన విషాద సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అమ్రేలి సమీపంలోని రాంధియాలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ఒకేసారి మృత్యువాతపడ్డారు.. చిన్నారులు ఆడుకుంటూ పక్కనే పార్క్‌ చేసి ఉంచిన కారులోకి ఎక్కారు.. అకస్మాత్తుగా కారు డోర్ లాక్ అయింది. దీంతో ఊపిరాడక కారులోనే పిల్లలందరూ ప్రాణాలు కోల్పోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన దంపతులు గుజరాత్‌ రాష్ట్రం ఆమ్రేలీ జిల్లాలోని రంధియా గ్రామంలో కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం వారి ఏడుగురు పిల్లలను ఇంటి దగ్గర విడిచి పెట్టి పనికి వెళ్లారు. ఈ క్రమంలోనే నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ఇంటికి సమీపంలో పార్క్ చేసిన ఓ కారులోకి ఎక్కారు. అంతలోనే కారు డోర్ లాక్ అయింది. దీంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక కారులోనే మరణించారు.

కూలీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లి దండ్రులకు పిల్లలు కనిపించలేదు. స్థానికుల సాయంతో చుట్టుపక్కల వెతకగా కారులో మృతి చెంది కనిపించారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరు బాలురు, బాలికలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు