Andhra Pradesh: గోమాతలకు సీమంతం..ఊరంతా సంబరం.. ఎంత బాగా చేశారో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

మంత్రాలు, హోమాల నడుమ గోమాతలకు శ్రీమంతం జరగటం ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు . మహిళలు గోమాతల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్షింతలు చల్లి నమస్కరించుకున్నారు. అనంతరం అందరికి తీర్ధ ప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు.

Andhra Pradesh: గోమాతలకు సీమంతం..ఊరంతా సంబరం.. ఎంత బాగా చేశారో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Gomatha Seemantham Function
Follow us
Fairoz Baig

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 04, 2024 | 9:16 PM

బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెన్నుబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన పశుపోషకులు హనుమంతరావు, సుబ్బాయమ్మ, రమాదేవిలు తమ రెండు గోమాతలకు 9వ నెల సందర్భంగా శ్రీమంతం చేశారు. బంధుమిత్రులు, గ్రామస్థులను ఆహ్వానించారు. శివుడికి ఇష్టయైన కార్తీక మాసం మొదటి సోమవారం రోజున హిందువులు పవిత్రంగా భావించే కామధేనువులకు అరుదైన గౌరవం లభించింది. రెండు గోవులకు శ్రీమంతాలు చేసి గోమాలతపై ఉన్న దైవభక్తిని చాటుకున్నారు. సాంప్రదాయం ప్రకారం మహిళలకు అక్షింతలు జల్లి ఏవిధంగా శ్రీమంతం జరిపిస్తారో అదే విధంగా ఆవులకి కూడ గ్రామస్థులు అందరూ కలిసి శ్రీమంతం చేశారు . పూలతో అందంగా అలంకరించిన అవులకు చీర, సారేలను కూడ బహుకరించారు .

ఊరంతా సంబరం…

గోమాతలకు జరుగుతున్న సీమంతాన్ని తిలకించేందుకు మహిళలు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు . ఈ వేడుకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది . మంత్రాలు, హోమాల నడుమ గోమాతలకు శ్రీమంతం జరగటం ఆనందంగా ఉందని స్థానికులు అంటున్నారు . మహిళలు గోమాతల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్షింతలు చల్లి నమస్కరించుకున్నారు. అనంతరం అందరికి తీర్ధ ప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. గోమాతలకు చేస్తున్న శ్రీమంతం తమ ఇంట్లో జరుగుతున్న కార్యంగానే భావించి గ్రామస్థులందరూ ఈ వేడుకలో పాల్గొనడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..