AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Post: వారెవ్వా..ఏం ఐడియా గురూ.. ఐరన్ బాక్స్‌ను ఇలా కూడా వాడొచ్చా..? భయ్యా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.!

వావ్‌ వాట్‌ ఏ బ్రెయిన్‌ గురూ..! అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, ఇది ఖచ్చితంగా మన దేశం వాళ్లదే.. ఎందుకంటే ఇండియన్స్ తెలివి అమోఘం అంటూ ఇంకొకరు రాశారు. అతడిది గొప్ప బ్రెయిన్ అంటూ మరొకరు ప్రశంసించారు. ఇలాంటి తెలివి తేటలు మన దేశం దాటి బయటకు వెళ్లకూడదంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.

Viral Post: వారెవ్వా..ఏం ఐడియా గురూ.. ఐరన్ బాక్స్‌ను ఇలా కూడా వాడొచ్చా..? భయ్యా.. నీ తెలివికి హ్యాట్సాఫ్.!
Iron Box Door Handle
Jyothi Gadda
|

Updated on: Nov 05, 2024 | 6:59 PM

Share

ఈ ప్రపంచంలో క్రియేటివిటిగా ఆలోచించే వారికి కొదవలేదు. వారికి అవకాశం, అవసరం వచ్చిన వెంటనే ఎలాంటి అద్బుతానైనా ఈజీగా చేస్తేస్తుంటారు. అలాంటి జుగాడ్‌ వీడియోలు, ఫోటోలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అలాంటివి చూసినప్పుడు మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. కొన్ని సార్లు కొందరు పాడైపోయిన కూలర్‌ను కొత్తగా తయారు చేసి వాడుతున్న వీడియో గతంలోనే చూశాం. మరికొందరు సైకిల్‌ వీల్‌తో వాషింగ్‌ మెషిన్‌ తయారు చేయటం కూడా చూశాం. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఫోటోలో అద్భుతమైన జుగాడ్ కనిపించింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మీ ఇంట్లో డోర్ హ్యాండిల్ పాడైపోయినప్పుడు మీరు ఏం చేస్తారు..ఏముంది.. కొత్త హ్యాండిల్‌ను ఫిట్‌ చేయించుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వైరల్ అవుతున్న పోస్ట్‌లో అలాంటిదే ఒకటి కనిపించింది. ఒక వ్యక్తి ఇంటి డోర్ హ్యాండిల్ పాడైపోయినప్పుడు.. దానికి బదులుగా ఏం చేశాడో చూస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే..వార్నీ ఏం తెలివి తేటలు గురూ అంటూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. అలా ఉంటుంది వారి వారి ఆలోచన. ఇంట్లో పాడైపోయిన ఐరన్‌ బాక్స్‌ ఇక్కడ కొత్త డోర్‌ హ్యాండిల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా వైరల్ అవుతోంది.

@BabaXwale అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ ఫొటో ప్రకారం.. ఆ ఇంటి తలుపు తీసేందుకు హ్యాండిల్‌ లేదు. దీంతో ఆ వ్యక్తి పాడైపోయిన ఐరన్ బాక్స్‌ను అతుడు తలుపునకు బిగించాడు.. ఐరన్ బాక్స్ హ్యాండిల్‌ పట్టుకుని తలుపును తీయటం వేయటం చేయొచ్చు. ఐరన్ బాక్స్‌ను డోర్ హ్యాండిల్‌గా వాడుకోవచ్చని నిరూపించిన సదరు వ్యక్తి తెలివితేటలకు నెటిజన్లు సెల్యూట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వేలల్లో వ్యూస్, వందల్లో లైకులతో దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి
Iron Box Door Handle

వావ్‌ వాట్‌ ఏ బ్రెయిన్‌ గురూ..! అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, ఇది ఖచ్చితంగా మన దేశం వాళ్లదే.. ఎందుకంటే ఇండియన్స్ తెలివి అమోఘం అంటూ ఇంకొకరు రాశారు. అతడిది గొప్ప బ్రెయిన్ అంటూ మరొకరు ప్రశంసించారు. ఇలాంటి తెలివి తేటలు మన దేశం దాటి బయటకు వెళ్లకూడదంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.  మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..