Watch: పిస్టల్‌తో బెదిరించి చోరీకి యత్నించిన దొంగకు పిచ్చెక్కించిన మహిళ.. బతుకు జీవుడా అంటూ..

వైరల్‌ వీడియోలో ఓ వ్యక్తి దుకాణంలోకి చొరబడి పిస్టల్‌తో బెదిరిస్తూ చోరీకి ప్రయత్నించడం కనిపిస్తోంది. ఆ వ్యక్తి షాపు కౌంటర్ దగ్గర నిలబడి అక్కడివారందరినీ బెదిరిస్తూ.. అవకాశం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. అక్కడే ఒక మహిళ తన పనిలో నిమగ్నమై ఉంది. అదును చూసి అతనిపై తిరగబడింది.

Watch: పిస్టల్‌తో బెదిరించి చోరీకి యత్నించిన దొంగకు పిచ్చెక్కించిన మహిళ.. బతుకు జీవుడా అంటూ..
thief entered shop with pistol
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 06, 2024 | 6:32 PM

సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో దొంగతనాలకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ చూస్తుంటాం..కొన్ని సంఘటనలు దొంగల ధైర్యసాహసాలు మనల్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. మరికొన్ని సంఘటనలు చూస్తే నవ్వుకునేలా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ మహిళ దొంగకు ఎలా గుణపాఠం చెప్పిందో చూస్తే ఆమెను ప్రశంసించకుండా ఉండలేరు.

వైరల్‌ వీడియోలో ఓ వ్యక్తి దుకాణంలోకి చొరబడి పిస్టల్‌తో బెదిరిస్తూ చోరీకి ప్రయత్నించడం కనిపిస్తోంది. ఆ వ్యక్తి షాపు కౌంటర్ దగ్గర నిలబడి అక్కడివారందరినీ బెదిరిస్తూ.. అవకాశం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. అక్కడే ఒక మహిళ తన పనిలో నిమగ్నమై ఉంది. అదును చూసి అతనిపై తిరగబడింది. దొంగ చేతిలోని పిస్టల్ లాగేందుకు ప్రయత్నిచింది. అతని మెడలు వంచి చితకబాదింది. ఇక లాభంలేదు.. పట్టుబడతానని గ్రహించిన ఆ దొంగ అన్నీ వదిలేసి అక్కడ్నుంచి పారిపోక తప్పలేదు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ మహిళ అంతటితో ఆగలదే..వెంటనే సమీపంలోని ఓ సుత్తితో దొంగను వెంబడించింది. ఈ ఘటన మొత్తమంతా షాపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియో బాగా వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..