ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

అది మింజుర్ రైల్వే స్టేషన్. సమయం అర్ధరాత్రి కావొస్తోంది. అప్పుడే నెల్లూరు నుంచి చెన్నై వెళ్లే ట్రైన్ వచ్చి ఫ్లాట్‌ఫార్మ్‌పై ఆగింది. ఈలోగా ఏసీ భోగి.. పక్కనే ఉన్న ఓ స్లీపర్ క్లాస్ నుంచి ఒక ప్రయాణీకుడి కంగారుగా..

ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 05, 2024 | 11:21 AM

నెల్లూరు నుంచి చెన్నై వెళ్తోన్న ట్రైన్ అది. ఏసీ భోగి వెలుపల ఉన్న స్లీపర్ క్లాస్ నుంచి ఏదో వింత వాసన ఒక్కసారిగా ప్రయాణీకులకు గుప్పుమని తగిలింది. రాత్రి సమయం కావడం.! అది కూడా అందరూ నిద్రపోతున్నారు కాబట్టి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ భోగిలోని ఒక ప్రయాణీకుడిపై కొందరికి డౌట్ వచ్చింది. ట్రైన్ సరిగ్గా అర్ధరాత్రి సమయంలో చెన్నైకి ఉత్తరాన శివారు ప్రాంతమైన మింజుర్ స్టేషన్‌కి చేరుకుంది. సదరు ప్రయాణీకుడు హుటాహుటిన తన దగ్గర ఉన్న సూట్‌కేసుతో దిగిపోయాడు. అతడి వెంటనే ఓ అమ్మాయి కూడా ఉండటం గమనార్హం.

ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్

ఇక ఆ స్టేషన్‌లో సూట్‌కేసు వదిలేసి.. మళ్లీ ట్రైన్ ఎక్కుతుండగా.. తోటి ప్రయాణీకులకు అనుమానం మరింతగా బలపడింది. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సూట్‌కేసును తనిఖీ చేసిన రైల్వే పోలీసులకు దెబ్బకు షాక్ తగిలింది. అందులో ఓ వృద్ధురాలి మృతదేహం ఉండటంతో.. సదరు ప్రయాణీకుడిని, అతడి వెంట వచ్చిన అమ్మాయిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. నిందితుడు నెల్లూరు జిల్లాకు చెందిన బాలసుబ్రమణ్యంగా పోలీసులు గుర్తించారు. వృద్ధురాలి తలపై బలమైన గాయాలు ఉండటాన్ని గుర్తించారు. బంగారం కోసం తల్లిని హత్య చేసినట్టు నేరాన్ని అంగీకరించాడు నిందితుడు. హత్యలో తండ్రికి కూతురు సహకరించినట్టు తేలింది. తండ్రి, కూతురు కలిసి వృద్దురాలిని హత్య చేసి.. ఆపై మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి.. మింజుర్ స్టేషన్‌కి తీసుకొచ్చినట్టు పోలీసులు తేల్చారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..