తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
దీపావళి తర్వాత మొదలయ్యే కార్తీక మాసం ఈసారి వెరీ స్పెషల్. నవంబర్ 12నుంచి డిసెంబర్ 16వరకూ సుమారు 18 శుభముహుర్తాలు ఉండడంతో భారీగా పెళ్లిళ్లు జరగనున్నాయి. రెండు నెలల్లో లక్ష పెళ్లిళ్ల వరకూ జరుగుతాయని అంచనా వేస్తున్నారు. నవంబర్‌లో 10, డిసెంబర్‌లో 8 శుభముహుర్తాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి సందడితో ఫంక్షన్ హాల్స్, దేవాలయాలకు భారీగా డిమాండ్ పెరిగింది.
ముహుర్తాలు కేవలం 18 మాత్రమే ఉండడంతో బుకింగ్స్ ఊపందుకున్నాయి. పెళ్లి చేయడానికి అవసరమైన ఫంక్షన్ హాల్స్, పురోహితులు, మంగళ వాయిద్యాలు, ఫుడ్ క్యాటరింగ్, ఫోటో గ్రాఫర్ల నుంచి డెకరేషన్, షామియానా, పూలు, పండ్లు, వస్త్ర, బంగారం వ్యాపారుల వరకూ భారీ గిరాకీ పెరిగింది. ముందస్తు బుకింగ్స్ తో అన్ని వ్యాపారాలు కళకళలాడుతున్నాయి. డిసెంబర్ తర్వాత మూఢాలు వస్తాయి. దీంతో జనవరిలో పెళ్లిళ్లు జరగవు. కనుక ఫిబ్రవరి, మార్చి వరకూ ఆగాల్సి ఉంటోంది. దీంతో చాలా మంది కార్తీక మాసంలో ఉన్న శుభముహుర్తాలకు మోగ్గుచూపుతున్నారు. దీంతో ఈసారి భారీగా డిమాండ్ పెరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊరిలో 70 ఏండ్ల నుంచి దీపావళి నిషేధం.. ఎందుకో తెలుసా ??
నల్ల గేదెకు తెల్ల దూడ పుట్టదా ??
రూ.72 లక్షలు.. ఒక్క ఫోన్ కాల్‌తో ఔట్ !!
ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం !! చివరికి ఏమైందంటే ??
టికెట్ తీసుకోమంటే కండక్టర్‌నే బెదిరించిన లేడీ కానిస్టేబుల్ !!
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

