రూ.72 లక్షలు.. ఒక్క ఫోన్ కాల్‌తో ఔట్ !!

రూ.72 లక్షలు.. ఒక్క ఫోన్ కాల్‌తో ఔట్ !!

Phani CH

|

Updated on: Nov 04, 2024 | 9:47 PM

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పలు రకాలుగా ప్రజలను మోసం చేస్తూ డబ్బులు చేజిక్కించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్ల మోసానికి అనేక మంది బలయ్యారు. తాజాగా ఓ రైల్వే ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు. ఏకంగా 72 లక్షలు రూపాయిల స్వాహా చేశారు కేటుగాళ్లు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో ఓ రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ పెట్టారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గుత్తిలోని చంద్రప్రియ నగర్ కు చెందిన రైల్వే ఉద్యోగికి నాలుగు రోజుల క్రితం ఫోన్ వచ్చింది. మేం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం… ఇటీవల ముంబైలో జరిగిన బాంబు పేలుళ్ళలో నువ్వెందుకు ఉన్నావు’ అంటూ అవతలి వైపు నుంచి రైల్వే ఉద్యోగికి వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ బ్యాక్ గ్రౌండ్ లో అచ్చం ఒక క్రైమ్ బ్రాంచ్ ఆఫీసు ఎలా ఉంటుందో.. అలాగే వీడియో కాల్ లో హడావుడి సృష్టించారు. దీంతో భయపడిన ఆ రైల్వే ఉద్యోగి తాను ముంబైకే వెళ్ల లేదని చెప్పగా సైబర్ నేరగాళ్లు రైల్వే ఉద్యోగిని దబాయించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో మీ ఏటీఎం కార్డు ఉంది. మర్యాదగా ఒప్పుకో.. లేకపోతే అరెస్టు చేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ రైల్వే ఉద్యోగి మొదట 12 లక్షలు…, తర్వాత 60 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆఖరికి ఫిక్సిడ్ డిపాజిట్ లో ఉన్న 22 లక్షల రూపాయలను డబ్బును…ఎఫ్డీలు రద్దు చేసుకొని సైబర్ మోసగాళ్లకు సమర్పించుకున్నాడు. నాలుగు రోజుల నుంచి ముభావంగా ఉన్న రైల్వే ఉద్యోగి మహ్మమద్ వలీని సహచరులు ఏమైందని ప్రశ్నించగా జరిగిన విషయం అంతా చెప్పారు. స్నేహితుల సూచన మేరకు బాధితుడు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు సైబర్ నేరగాళ్ల ఫోన్ నంబర్లలో ఒకటి జమ్మూకశ్మీర్ నుంచి, మరొకటి కోల్ కత్తా నుంచి వచ్చినట్లు తెలిసింది…. బాధితుడు మహమ్మద్ వలి పోలీసులను ఆశ్రయించడం ఆలస్యం అవ్వడంతో…. 72 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం !! చివరికి ఏమైందంటే ??

టికెట్‌ తీసుకోమంటే కండక్టర్‌నే బెదిరించిన లేడీ కానిస్టేబుల్ !!

BSNL సిమ్‌ల కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలుసా ??

కుక్క పిల్లల మృతి విషయంపై దంపతుల మధ్య వాగ్వాదం.. చివరకు ??

Nayanthara: ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందా ?? క్లారిటీ ఇచ్చిన నయనతార