Nayanthara: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా ?? క్లారిటీ ఇచ్చిన నయనతార
తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గతంలో వచ్చిన వార్తలను నటి నయనతార కొట్టిపారేశారు. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో సినిమాలతో అలరిస్తోన్న నయనతార తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. తన కనుబొమలు అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు.
వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాననీ ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్లకు ముందు వాటిని మార్చుతుంటాననీ తెలిపారు. వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాననీ కనుబొమల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుందనీ బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకొని ఉంటారని చెప్పారు. వాళ్లు అనుకున్నది నిజం కాదనీ అలాగే డైటింగ్ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు అన్నారు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తుంటాయనీ మరోసారి అవి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తుంటుందని కావాలంటే తనను గిచ్చి చూడొచ్చు తన శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదని నయనతార సరదాగా చెప్పారు. 2003లో మలయాళం చిత్రంతో నయనతార ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో ఆమె తొలిసినిమాలో కంటే సన్నగా కనిపించారు. దీంతో ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా నయనతార వాటికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు. గతేడాది 3 సినిమాలతో అలరించిన ఆమె.. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రష్యాలో ప్రభాస్ క్రేజ్.. కల్కీ రీ- రిలీజ్
ఫోటోలు తీసే పేరుతో.. హీరోయిన్ పై దారుణ కామెంట్స్
Kiran Abbavaram: రహస్యతో పెళ్లికి.. కిరణ్ తీసుకున్న కట్నం ఎంతో తెలుసా ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

