ఫోటోలు తీసే పేరుతో.. హీరోయిన్ పై దారుణ కామెంట్స్
సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫోటోగ్రాఫర్స్ హడావిడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. సెలబ్రెటీస్ ఎక్కడ కనిపించిన పర్మిషన్ లేకుండానే ఫోటోస్, వీడియోస్ తీస్తు తెగ హల్చల్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో స్టార్స్ ఇబ్బందికి గురవుతున్నా ఏమాత్రం పట్టించుకోరు. ఇప్పటికే రణబీర్ కపూర్, అలియా భట్, దీపికా, జయా బచ్చన్ వంటి స్టార్స్ ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అయ్యారు.
తాజాగా ఓ హీరోయిన్ పట్ల ఫోటోగ్రాఫర్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. దీపావళి పండగ సందర్భంగా నటుడు అర్జున్ బిజ్లానీ ముంబైలో పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి పలువురు సెలబ్రెటీలు హజరయ్యారు. అందులో బాలీవుడ్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ సనా మక్బుల్ కూడా ఉంది. పార్టీలో అడుగుపెట్టేముందు అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు ఓపికగా ఫోజులిస్తూ ఫోటోస్ దిగింది. కాసేపటికి ఓ ఫోటోగ్రాఫర్ సనాను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఆమెకు కోపం తెప్పించాయి. చిరునవ్వుతో ఫోటోస్ దిగుతున్న సనాను ఉద్దేశించి ఓ ఫోటోగ్రాఫర్ అసలు మజాయే రావట్లేదు. ఇటు తిరగండి అంటూ కటువుగా మాట్లాడాడు. దీంతో అతడి మాటలు విని షాకైన సనా వెంటనే అతడికి కౌంటరిచ్చింది. ఇది చాలా తప్పు. ఇంత చీప్ గా ప్రవర్తిస్తారా..? మీరిలా మాట్లాడకూడదు.. అంటూ కాస్త నవ్వుతూనే కౌంటరిచ్చింది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. సదరు ఫోటోగ్రాఫర్ తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సనా మక్బుల్ తెలుగులో దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ చిత్రాల్లో నటించి మెప్పించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kiran Abbavaram: రహస్యతో పెళ్లికి.. కిరణ్ తీసుకున్న కట్నం ఎంతో తెలుసా ??
Dulquer Salmaan: తన లవ్ స్టోరీ చెబుతూ సిగ్గు పడిన హీరో
బ్రహ్మంగారు చెప్పినట్టే చింత చెట్టుకు పారుతున్న కల్లు
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

