టికెట్‌ తీసుకోమంటే కండక్టర్‌నే బెదిరించిన లేడీ కానిస్టేబుల్ !!

టికెట్‌ తీసుకోమంటే కండక్టర్‌నే బెదిరించిన లేడీ కానిస్టేబుల్ !!

Phani CH

|

Updated on: Nov 04, 2024 | 9:15 PM

హర్యానాకు చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ రాజస్థాన్ రోడ్ వేస్‌కు చెందిన బస్సు ఎక్కారు. దీంతో టికెట్ తీసుకోవాలంటూ బస్ కండక్టర్ కోరారు. సదరు కానిస్టేబుల్ బస్సు ఛార్జీని చెల్లించడానికి నిరాకరించింది. మహిళా పోలీసులకు హర్యానా అర్టీసీలో ఫ్రీ ప్రయాణం ఉందని వారించింది. అయితే, ఇది హర్యానా రోడ్‌వేస్ కాదు, రాజస్థాన్ రోడ్‌వేస్ అని కండక్టర్ వాదించాడు.

కానీ మహిళా కానిస్టేబుల్ ఛార్జ్ చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడంతో కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. మహిళా కానిస్టేబుల్‌ను టికెట్ తీసుకోవాలని తోటి ప్రయాణికులు సైతం కోరారు. కానీ ఆమె అంతే గట్టిగా టికెట్ తీసుకోవడానికి నిరాకరించారు. వాగ్వాదం సమయంలో కానిస్టేబుల్.. ఆ బస్సు కండక్టర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు. ఈ సమయంలో కండక్టర్ స్వయంగా ఆ మహిళను వీడియో తీశాడు. ఇక కండక్టర్‌.. ఆ మహిళా కానిస్టేబుల్‌కు మీరు ఈ బస్సులో ప్రయాణం చేయాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందేనని గట్టిగా వాదించాడు. అయితే ఆ మహిళా కానిస్టేబుల్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు. ఈ వీడియో ఘర్ కే కలేష్ అనే వ్యక్తి తన ఎక్స్‌ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను 74 వేల మందికి పైగా వీక్షించారు. చాలామంది ఈ వీడియోను లైక్ చేశారు. భిన్నరకాలుగా స్పందించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

BSNL సిమ్‌ల కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలుసా ??

కుక్క పిల్లల మృతి విషయంపై దంపతుల మధ్య వాగ్వాదం.. చివరకు ??

Nayanthara: ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుందా ?? క్లారిటీ ఇచ్చిన నయనతార