కుక్క పిల్లల మృతి విషయంపై దంపతుల మధ్య వాగ్వాదం.. చివరకు ??
దంపతుల మధ్య విభేదాలు రావడం సహజం. అయితే కలహాలను మరింత పెద్దవి చేయకుండా ఆదిలోనే వాటిని పరిష్కరించాలి. లేదంటే తీవ్ర మనస్తాపంతో ఇద్దరిలో ఒకరు ప్రాణాలు తీసుకునే దాకా వ్యవహారం వెళ్లిందంటే కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళుతుంది . తమిళనాడులోని కాంచీపురంలో పెంపుడు కుక్క పిల్లలు మురుగు కాలువలో పడి మృతి చెందడంతో భర్తతో ఏర్పడిన గొడవతో మహిళా..
హెడ్‌కానిస్టేబుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాంచీపురం తిరువీధి పల్లంలో దిగేశ్వరన్.. అతడి భార్య గిరిజ నివాసం ఉంటున్నారు. ఆమె చెంగల్‌పట్టు ఆల్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్. దిగేశ్వరన్ మధురవాయల్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్నాడు. వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన వీరిద్దరూ 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పిల్లలు లేకపోవడంతో కుక్కను పెంచుకున్నారు. పెంపుడు కుక్క ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. వీటిలో రెండు పిల్లలు.. సమీపంలోని కాలువలో పడి మృతిచెందాయి. ఈ విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గిరిజ శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nayanthara: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా ?? క్లారిటీ ఇచ్చిన నయనతార
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

