ఆ ఊరిలో 70 ఏండ్ల నుంచి దీపావళి నిషేధం.. ఎందుకో తెలుసా ??

ఆ ఊరిలో 70 ఏండ్ల నుంచి దీపావళి నిషేధం.. ఎందుకో తెలుసా ??

|

Updated on: Nov 04, 2024 | 10:02 PM

దేశమంతా దీపావళి శోభ నెలకొంది. ఊరు, వాడ, నగరాలన్నీ దీపావళి కాంతులతో కళకళలాడుతున్నాయి. టపాసుల మోతలతో దద్దరిల్లుతున్నాయి. ఇంటిని కాంతులతో అలంకరింకుకొని.. కొత్త బట్టలు కట్టుకొని మిఠాయిలు పంచుకుంటున్నారు. లక్ష్మీ పూజలు చేస్తున్నారు. ఇదంతా దేశ వ్యాప్తంగా జరుగుతుంటే .. ఆగ్రామం మాత్రం దీపావళి సెలబ్రేషన్‌కి ఆమడ దూరంలో ఉంది.

ఏడు దశాబ్ధాలుగా దీపావళి రోజున గ్రామమొత్తంలో ఒక్క దీపం వెలిగించరూ.. ఒక్క టపాసు మోత వినిపించదు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఉంది ఈగ్రామం. రావికమతం మండలం కిత్తం పేట గ్రామంలో మాత్రం పూర్తిగా భిన్నమైన పరిస్థితి దీపావళినాడు కనిపిస్తుంది. దాదాపు 5వందల ఇళ్లు, సుమారు 2వేల మంది జనాభా ఉండే ఈఊరిలో రాజకీయంగా చాలా చైతన్యవంతమైన గ్రామం. జడ్ గన్నవరం పంచాయతీలోని కిత్తంపేట నుంచే పంచాయితీ సర్పంచులుగా ఎన్నికవుతారు. ఇదంతా ఒకవైపు అయితే.. ఈ ఊరి వారంతా దీపావళి పండగకు దూరంగా ఉండటం ఆచారంగా వస్తోంది. ఇక్కడ టపాసులు పేలవు.. దీపావళి నాడు ఊరంతా వెతికిన ఒక్క దీపం కనిపించదు. అందరిలాగానే 70ఏళ్ల క్రితం కిత్తంపేట గ్రామంలోను దీపావళిని గ్రాండ్‌గా చేసుకునే వారు. అప్పడు ఊరంతా పాకలే ఉందేవి. పాడి, వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం ఇది. గ్రామంలో గడ్డివాములు, పశువులు ఇంటి ఆవరణలోనే ఉండేవి. దీపావళి నాడు నిప్పురవ్వలు పడి అగ్ని ప్రమాదం సంభవించింది. ఊరంతా సర్వసం కోల్పోయింది. అప్పట్నుంచి అన్నీ అపశకునాలేనట. ప్రతి దీపావళి నాడు ఏదో ఒకటి కీడు జరుగేదట. దీంతో గ్రామంలో ఎవరు దీపాలు వెలిగించడం, టపాసులు పేల్చడం మానేశారు. గ్రామమంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితిని మాత్రం గ్రామమంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. పెద్దల తీసుకున్న ఈనిర్ణయాన్ని యువత కూడా పాటిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నల్ల గేదెకు తెల్ల దూడ పుట్టదా ??

రూ.72 లక్షలు.. ఒక్క ఫోన్ కాల్‌తో ఔట్ !!

ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం !! చివరికి ఏమైందంటే ??

టికెట్‌ తీసుకోమంటే కండక్టర్‌నే బెదిరించిన లేడీ కానిస్టేబుల్ !!

BSNL సిమ్‌ల కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలుసా ??

Follow us