నల్ల గేదెకు తెల్ల దూడ పుట్టదా ??

నల్ల గేదెకు తెల్ల దూడ పుట్టదా ??

Phani CH

|

Updated on: Nov 04, 2024 | 9:48 PM

తెల్లటి ఆవులకు నల్లటి దూడలు పుడతాయి. కానీ నల్లగా ఉండే గేదెలకు తెల్లటి దూడ పుట్టటం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది జరిగితే మాత్రం ప్రజలు దాన్నో వింతగానే చూస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా గేదెలు నలుపు రంగులో ఉంటాయి. వాటికి పుట్టే దూడలు సైతం అదే రంగులో ఉంటాయి.

మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలోని ఎల్లక్కపేట గ్రామంలో తెల్లని దూడ పిల్లకు జన్మనిచ్చింది ఓ నల్లటి గేదె. గ్రామానికి చెందిన దండ్ల సతీష్ అనే వ్యక్తికి చెందిన గేదెకి తెల్లని దూడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆ తెల్లని దూడ పిల్లని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. చూడటానికి అచ్చం లేగదూడలా ఉండటంతో చుట్టుపక్కల జనం దానిని చూడటానికి తరలివస్తున్నారు. ఆ దూడను చూస్తుంటే గేదెకు ఆవుదూడ పట్టిందా… అని అనిపిస్తోందని అంటున్నారు. అయితే జన్యులోపం కారణంగానే అరుదుగా గేదెలకు తెల్లదూడలు పుడతాయని పశువైద్యులు చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.72 లక్షలు.. ఒక్క ఫోన్ కాల్‌తో ఔట్ !!

ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం !! చివరికి ఏమైందంటే ??

టికెట్‌ తీసుకోమంటే కండక్టర్‌నే బెదిరించిన లేడీ కానిస్టేబుల్ !!

BSNL సిమ్‌ల కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలుసా ??

కుక్క పిల్లల మృతి విషయంపై దంపతుల మధ్య వాగ్వాదం.. చివరకు ??