Viral Video: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

పురావస్తు తవ్వకాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ రోజూ ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తుంటాయి. చారిత్రక నిక్షేపాలు, నిధులు.. పలు కట్టడాలు భూమి కింద దొరకడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఆ కోవకు చెందిన ఓ ఘటన ఇప్పుడు..

Viral Video: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా
Trending
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 05, 2024 | 7:32 PM

ఇటీవల కాలంలో ఎన్నో చోట్ల పురాతన నిధులు, నిక్షేపాలు, విగ్రహాలు దొరుకుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. పాత ఇళ్లు కూల్చుతుండగా.. ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. ఇలా ఒకటేమిటి అనేక ప్రాంతాల్లో పురాతన ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఇక పురావస్తు శాస్త్రవేత్తలు అయితే.. చారిత్రక ఆధారాల కోసం ఎలప్పుడూ ఏదొక ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూనే ఉంటారు. వారికి నిధులు, చారిత్రక కట్టడాలు దొరికిన సందర్భాలు లేకపోలేదు. ఇక తాజాగా కొందరు లైకుల కోసం ఇలాంటి పురావస్తు తవ్వకాలు చేపడుతూ.. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఇది చదవండి: పత్తి చేనులో కలుపు తీస్తుండగా.. బాబోయ్.! కనిపించింది చూసి గుండె గుభేల్

ఇవి కూడా చదవండి

ఓ వ్యక్తి పురావస్తు తవ్వకాలు జరపగా.. అతడికి మట్టిలో ఓ నల్లటి ఆకారం కనిపించింది. ఆ ఆకారం ఏంటా అని చూసేందుకు చుట్టూ ఉన్న మట్టిని బయటకు తీశాడు. ఇక అది నల్లటి ఆకారం ఉన్న ఓ షెల్ కాగా.. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. అందులో ముత్యాలు లాంటివి బయటపడ్డాయి. ఈ తవ్వకాలు ఏ ప్రాంతంలో చేపట్టారు.? దొరికిన వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియకపోగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో

View this post on Instagram

A post shared by India YaTra (@india.yatra)

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..