అక్కడ మగవారికి ఇద్దరేసి భార్యలు.. ఎందుకో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు

దేశం నలుమూలల ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఇక అక్కడున్న స్థానికులు వారికి అనుగుణంగా ఉండే పలు ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఇక ఇప్పుడు మేము అలాంటిది ఒకటి చెప్పబోతున్నాం.

అక్కడ మగవారికి ఇద్దరేసి భార్యలు.. ఎందుకో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 06, 2024 | 7:57 PM

వివిధ సంప్రదాయాలకు నిలయం మన భారతదేశం. దేశంలోని ప్రతీ గ్రామం.. ప్రత్యేకమైన ఆచారాలకు, సంప్రదాయాలకు ప్రసిద్ది చెందాయి. అయితే పలు గ్రామాల్లోని కొన్ని సంప్రదాయాలు ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ కోవకు చెందినదే ఓ సంప్రదాయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని జైసల్‌మీర్ జిల్లాలోని రామ్‌దేవర బస్తీ అనే గ్రామంలోని ప్రతీ పురుషుడు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకుంటాడట. ఇక తన భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య ఏమాత్రం అడ్డుచెప్పదట. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా.. అక్కడ ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. అంతేకాదు అక్కడి స్థానికులు ఈ సంప్రదాయాన్ని ఎంతగానో గౌరవిస్తారట. ఇంతకీ దీనికి కారణం ఏంటంటే.! రామ్‌దేవర బస్తీ గ్రామంలోని పురుషులు తమ మొదటి భార్య గర్భం దాల్చలేదని నమ్ముతారు. ఒకవేళ ఆమె గర్భం దాల్చినా.. కూతురే పుడుతుందట. అలాగే ఆ గ్రామంలో ఆడపిల్లల సంఖ్య పెరుగుతోంది. ఈ కారణంగానే అక్కడి పురుషులు రెండేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తద్వారా తమ కుటుంబంలో వంశోద్ధారకుడు జన్మిస్తాడని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

అయితే ఈ సంప్రదాయాన్ని నేటితరం యువత వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇంకొందరు.. సమాజంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ ప్రాంతంలో కాలానుగుణంగా పురుషుల సంఖ్య తక్కువగా ఉండటం, ఈ సంప్రదాయం వెనుక ఒక కారణమని వాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఈ సంప్రదాయాన్ని అక్కడి స్త్రీలు సైతం అంగీకరిస్తారట. తమ భర్తల కోసం మరో యువతిని అప్పుడప్పుడూ వారే చూస్తుంటారట కూడా.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..