Watch: స్టేడియంలో కుప్పకూలి అథ్లెట్ మృతి..అందరూ చూస్తుండగా ఇలా.. వీడియో వైరల్

ఒక్కసారిగా స్టేడియంలోనే కుప్పకూలి కింద పడిపోయాడు. అతడిని గమనించిన ఆటగాళ్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Watch: స్టేడియంలో కుప్పకూలి అథ్లెట్ మృతి..అందరూ చూస్తుండగా ఇలా.. వీడియో వైరల్
athlete dies after collapsing in stadium
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 06, 2024 | 8:01 PM

పంజాబ్‌లోని లూథియానాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. లూథియానాలోని గురునానక్ స్టేడియంలో నవంబర్‌ 6 గురువారం అథ్లెట్ వరీందర్ సింగ్ (54) ఫోన్‌లో మాట్లాడుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఒక్కసారిగా స్టేడియంలోనే కుప్పకూలి కింద పడిపోయాడు. అతడిని గమనించిన ఆటగాళ్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక్కడ క్లిక్ చేయండి..

లూథియానాతో సహా పంజాబ్‌లోని ఐదు జిల్లాల్లో జరిగిన అథ్లెటిక్స్, బేస్ బాల్, కిక్‌బాక్సింగ్ మరియు లాన్ టెన్నిస్‌లతో కూడిన రాష్ట్రవ్యాప్త క్రీడా ఈవెంట్ ఖేదాన్ వతన్ పంజాబ్ దియాన్ సీజన్ 3లో పాల్గొనడానికి సింగ్ జలంధర్ నుండి వచ్చారు.. సింగ్ తన లాంగ్ జంప్ ఈవెంట్‌ను అంతకుముందు రోజు పూర్తి చేశాడు. ఇతర అథ్లెట్లను చూస్తూ ఫోన్‌ మాట్లాడుతూ.. సాయంత్రం 5:30 గంటలకు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. పోటీ సోమవారం ప్రారంభమైంది. గురునానక్ స్టేడియంతో సహా పలు వేదికలలో నవంబర్ 9 వరకు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..