Health Tips: పచ్చిగా లేదా వండినా.? కూరగాయలు ఎలా తినడం ఆరోగ్యానికి మంచిది

ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, చేపలు, గుడ్లు, పాలు, మాంసం వంటివి రోజువారీ ఆహారాల్లో తీసుకోవాల్సిందేనా.. ఈ ఆహారాలకు సంబంధించి పలు అపోహలు కూడా ప్రజల్లో నెలకొంటున్నాయా..?

Health Tips: పచ్చిగా లేదా వండినా.? కూరగాయలు ఎలా తినడం ఆరోగ్యానికి మంచిది
Vegetables
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 09, 2024 | 9:11 PM

కొందరు బంగాళ దుంపలను పచ్చివిగా తింటే బలం వస్తుందని చెప్తుంటారు. కానీ ఇది నిజం కాదని పైగా అలా తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుందంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే రా పొటాటోస్ తినడం వల్ల వీటిలోని పిండి పదార్థాలు జీర్ణ వ్యవస్థను గందరగోళ పరుస్తాయి. అంతేకాకుండా వీటిలో గ్లైకో ఆల్కలాయిడ్స్ అనే విషపూరిత సమ్మేళనాలు ఉంటాయని ఇవి జీర్ణ సమస్యలకు, అలర్జీలకు దారితీస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి పచ్చివి తినకుండా వండుకొని తినడమే మంచిదంటున్నారు. అలానే రబ్బర్ లీవ్స్ అనే ఆకు కూరను పచ్చిగా తింటే మంచిదని కొందరు చెప్తుంటారు. అలా తినడంవల్ల ఇందులో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ అనే విషపూరిత అమ్లం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

చిక్కుడుగాయ విత్తనాలను, బొబ్బర్లను పచ్చిగా తింటే కిడ్నీల ఆరోగ్యానికి మంచి జరుగుతుందనే అపోహ కూడా ఉంది. వాస్తవానికి ఇలా తినడం ఆరోగ్యానికి హానికరం. ఫుడ్ పాయిజన్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిక్కుళ్లు, బొబ్బర్లు వంటివి పచ్చిగా ఉన్నప్పుడు లినామరిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. వండుకొని తింటే మేలు జరుగుతుంది. కానీ పచ్చిగా తింటే అందులోని లినామరిన్ సైనైడ్గా మరి అవకాశం ఉందంటున్నా వైద్యులు. ఇక రెడ్ కిడ్నీస్ లేదా బొబ్బర్లలో కూడా పచ్చిగా ఉన్నప్పుడు లెక్టిన్స్ కలిగి ఉంటాయి. ఇవి జీర్ణాశయాంతర సమస్యలకు కారణం అవుతాయి. వండటం లేదా ఉడకబెట్ట దంవల్ల అవి నాశనం అవుతాయి. సూపర్ మార్కెట్లలో ప్రస్తుతం రకారకాల మష్రూమ్స్ దొరుకుతున్నాయి. అలాంటి వాటిలో వైల్డ్ మష్రూమ్స్ కూడా ఒకటి. అయితే వీటిని పచ్చివిగా తినడం సేఫ్ కాదు. తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కు అవి దారితీస్తాయి. కాబట్టి ఎలాంటి పుట్టగొడుగులైనా సరే ఉడికించి లేదా వండి తినడంవల్ల రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

పచ్చి పాలు, పచ్చి గుడ్డు తినడం, తాగడంవల్ల బలం వస్తుందని చాలా మందికి అపోహ ఉంది కానీ ఇలా తినడం ఆరోగ్యానికి హానికరం అంటున్న పోషకాహార నిపుణులు. పచ్చి పాలల్లో, గుడ్లల్లో వ్యాధికారకమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. పైగా వీటిలోని ప్రోటీన్స్ పచ్చిగా ఉన్నప్పుడు తినడంవల్ల జీర్ణం కావు కాబట్టి పచ్చివి ఎప్పుడూ సేఫ్ కాదని గుర్తుంచుకోవాలంటున్న వైద్యులు. సాధారణంగా చికెన్, ఫోర్క్, బీఫ్ ఇలా ఏ మాంసమైనా వండుకొని తింటారు. అయితే కొందరు పచ్చిగా తింటే శరీరానికి బలం వస్తుందనే అపోహ కూడా ఉంది. బలం మాట దేవుడెరుగు ప్రాణహాని మాత్రం ఖచ్చితంగా సంభవించే అవకాశం ఉందంటున్న నిపుణులు. నిజానికి పచ్చి మాంసంలో క్యాంపిలో బాక్టర్, క్లోస్టిడియం పెళ్లింజెన్స్ అండ్ సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. పచ్చిగా తింటే ఇవి ఫుడ్ పాయిజనింగ్ కు కారణం అవుతాయి. పచ్చి వంకాయ, వచ్చి మొలకలు తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు అనే ప్రచారం కూడా సాగుతోంది కానీ ఇవి హానికరం.. పచ్చి వంకాయలో సోలనిన్ అనే సమ్మేళనం ఉంటుంది. వాస్తవానికి ఇది గ్లైకోలలాయిడ్ పాయిజన్, పచ్చిగా తింటే ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కొందరు పఫర్ ఫిషెస్ ను పచ్చిగా తినాలని అంటుంటారు. వాస్తవానికి ఇవి వండి తిన్నా నష్టమే. వీటిలో చెట్రోడో టాక్సిన్ అనే పాయిజనింగ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి తినకూడదు. చాలా మంది వచ్చి మొలకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆపోహ పడుతుంటారు. వీటిలో కూడా ఈ కోలీ, బ్యాక్టీరియాలు ఉంటాయి. పచ్చివిగా తినడం ప్రమాదకరం. గత పది పదిహేను సంవత్సరాల క్రితం వరకు వ్యవసాయ ఉత్పత్తులకు పురుగుమందు పిచికారీ చాలా తక్కువగా ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తులు ప్రతిదానిలో కూడా పురుగుమందు అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పురుగు మందు పిచికారి ఎక్కువ కావడం దీనికి ప్రధాన కారణం అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఉడక పెట్టినవి కాకుండా పచ్చివి ఏలాంటివి తిన్నా కూడా ఆరోగ్యానికి హానికరమే అంటున్న వైద్యాన్ని నిపుణులు.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి