AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలికతో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆమె ఏం చేసిందంటే

చేసిందేమో పాడుపని.. ఎవ్వరూ చూడరు.. ఏమి చేయలేరు అని అనుకున్నారు. కానీ దేవుడు తను చేసిన పనికి శిక్ష విధించాడు.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. ఈ స్టోరీలో తెలుసుకోండి..

బాలికతో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆమె ఏం చేసిందంటే
Representative Image
Ravi Kiran
|

Updated on: Nov 07, 2024 | 7:52 PM

Share

జీవితం చాలా చిన్నది. చావు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇక కరోనా వచ్చిన తర్వాత నుంచి గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. ఇక ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీ కూడా ఇలాంటి కోవకు చెందినదే. కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఓ విలన్ అని చెప్పొచ్చు. పాడుపని చేస్తుండగా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అదేంటంటే..

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

వివరాల్లోకి వెళ్తే.. సూరత్‌లోని ఓ వజ్రాల కంపెనీలో పని చేస్తోన్న మేనేజర్.. టీనేజ్ బాలికతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుని మృతి చెందాడు. గుజరాత్‌కు చెందిన సదరు 41 ఏళ్ల వ్యక్తి.. 14 ఏళ్ల బాలికను ముంబైకి తీసుకొచ్చి హోటల్ గదిలో లైంగిక చర్యకు పాల్పడుతున్న సమయంలో గుండెపోటుకు గురయ్యి మరణించాడు. ఆ వజ్రాల కంపెనీ మేనేజర్ సదరు బాలిక కుటుంబానికి ఆర్ధిక సాయం చేయడమే కాదు. ఆమె కుటుంబంతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. దీంతో అతడిపై నమ్మకం ఉంచిన బాలిక కుటుంబ సభ్యులు.. ఆమెను పని నిమిత్తం వేరే ఊరు పంపించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఈ క్రమంలోనే నవంబర్ 2న సదరు మేనేజర్ బాలికను పని నిమిత్తం ముంబైకి తీసుకువచ్చి గ్రాంట్ రోడ్డులోని ఓ హోటల్‌లో నకిలీ ఆధార్ కార్డు ద్వారా గది తీసుకున్నాడు. లైంగిక చర్యకు సహకరించకపోతే ఆమె కుటుంబానికి డబ్బు ఇవ్వడం ఆపేస్తానని, ఇప్పటివరకు ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి తీసుకుంటానని బాలికను బెదిరించాడు. సంభోగం సమయంలో వయాగ్రా మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అనంతరం వెంటనే సదరు బాలిక తల్లికి సమాచారం అందించగా.. ఆమె సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుంది. కాగా, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై బీఎన్ఎస్, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మృతి చెందటంతో.. ఈ ఘటనపై సమగ్ర నివేదికను రూపొందించి కోర్టుకు సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..