Lady Aghori: శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తి ఆలయం దగ్గర అఘోరీ హల్‌చల్ చేసింది. ఆలయ అధికారులు అఘోరీని లోనికి అనుమతించక పోవడంతో రచ్చ జరిగింది. మనస్ధాపం చెందిన అఘోరీ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అడ్డుకున్న పోలీసులు అఘోరీపై బిందెలతో నీళ్లు పోశారు. అయినా పట్టువీడని అఘోరీ స్వామి దర్శనం చేసుకుని తీరుతానంటూ భీష్మించుకుని కూర్చుంది.
అఘోరీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈమె గురించి తెలియని జనం లేరు. నిన్న మొన్న వైజాగ్‌లో కనిపించిన ఈ అఘోరీ.. సడన్‌గా శ్రీకాళహస్తి ఆలయం ముందు ప్రత్యక్షమైంది. శ్రీకాళ హస్తీశ్వరుణ్ణి దర్శించుకుంటానని కారు దిగి ఆలయం లోపలికి వెళ్లబోయింది. అంతే.. ఒక్కసారిగా పోలీసులు, ఆలయ సిబ్బంది చుట్టు ముట్టారు. ఇలా నగ్నంగా ఆలయంలోకి వెళ్తామంటే కుదరదు గాక కుదరదని తేల్చి చెప్పేశారు. అంతే ఒక్కసారిగా రెచ్చిపోయిన అఘోరీ.. వెంటనే కారులో పెట్రోల్ క్యాన్ తీసి ఒంటి మీద పోసుకుంది. లోపలికి వెళ్లనివ్వకపోతే ఇప్పుడే.. ఇక్కడే ఒంటికి నిప్పంటించుకుంటానని బెదిరించింది.
అంతే.. ఒక్కసారిగా సిట్యువేషన్ మారిపోయింది. ఆమెను ఆ పని చెయ్యకుండా అడ్డుకునేందుకు పోలీసులు నానా పాట్లు పడ్డారు. చివరకు ఎలాగోలా ఆమెను ఆత్మహత్య చేసుకోకుండా బిందెలతో నీళ్లు పోసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసుపై కూడా పెట్రోల్ పడింది. ఆపై ఆమెకు నచ్చజెప్పి బట్టలిచ్చి కట్టించారు. అక్కడితో టెంపుల్ దగ్గర టెన్షన్‌కి బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ అఘోరీ అడుగు పెడితే అక్కడ పోలీసులకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. మరోవైపు జనం వేలం వెర్రిగా ఆమెను చూడ్డానికి క్యూలు కడుతున్నారు. ఈ అఘోరీ తన ఫ్యూచర్ స్టెప్స్ గురించి చాలా చాలా చెప్పుకుంటూ వస్తోంది. అంటే మున్ముందు పోలీసులకు పెద్ద పని ఉన్నట్టే కనిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో

