గ్రామ సింహలా.. మజాకానా.. కిడ్నాపర్‌లను ముప్పుతిప్పలు పెట్టిన కుక్కలు.. దెబ్బకు సినిమా చూశారుగా

సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన మేనకోడలు ఇంట్లో ఒంటరిగా ఉండగా, ఇద్దరు వ్యక్తులు వచ్చి తలుపు కొట్టారు. బాలిక తలుపు తెరవగా, ఓ వ్యక్తి ఆమెను ఎత్తుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. బాలిక అరవకుండా నోటిని గట్టిగా మూసివేశారని, గోడకు అవతలివైపు ఉన్న పొలంలో నిలబడి ఉన్న మరో దుండగుడి వైపుకు విసిరాడు. ఆ తరువాత అతడు కూడా గోడ దూకి అటువైపు వెళ్లాడు.

గ్రామ సింహలా.. మజాకానా.. కిడ్నాపర్‌లను ముప్పుతిప్పలు పెట్టిన కుక్కలు.. దెబ్బకు సినిమా చూశారుగా
Stray Dogs
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2024 | 6:53 PM

కుక్కల విధేయత గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు విన్నాం, చూశాం. కుక్కలు తమ యజమానికి ఎంత విధేయంగా ఉంటాయో అనేక సంఘటనలు నిరూపించాయి. అయితే, మధ్యప్రదేశ్‌లోని బెట్మాలో జరిగిన ఒక సంఘటనతో కుక్కలు తమ యజమానికి మాత్రమే కాదు.. ఆ వీధిలో నివసించే ప్రతి వ్యక్తికి విధేయంగా ఉంటాయని ఖచ్చితంగా నమ్మల్సిందే. ఇక్కడ వీధి కుక్క ఓ బాలిక ప్రాణాలను రక్షించాయి.. కిడ్నాప్‌కు గురైన పదేళ్ల బాలికను వీధికుక్కలు కాపాడాయి. పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను వీధి కుక్కలు తరిమి కొట్టాయి. దెబ్బకు దుండగులు పారిపోయేలా చేశాయి.

మధ్యప్రదేశ్‌లోని బెత్మాలో కిడ్నాప్‌కు గురైన పదేళ్ల బాలికను వీధికుక్కలు కాపాడాయి. ఈ ఘటనలో ఇద్దరు దుర్మార్గులు ఒంటరిగా ఉన్న బాలికను చూసి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న వీధికుక్కలు గమనించిన దుండగులపై దాడి చేశాయి. కుక్కల దాడితో అగంతకులు భయపడి బాలికను వదిలిపెట్టి పరుగులు తీశారు. ఈ ఘటన బెత్మాలోని కాలీ బిలౌడ్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలి మేనమామ శ్రవణ్‌కుమార్‌ చెప్పిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన మేనకోడలు ఇంట్లో ఒంటరిగా ఉండగా, ఇద్దరు వ్యక్తులు వచ్చి తలుపు కొట్టారు. బాలిక తలుపు తెరవగా, ఓ వ్యక్తి ఆమెను ఎత్తుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. బాలిక అరవకుండా నోటిని గట్టిగా మూసివేశారని, గోడకు అవతలివైపు ఉన్న పొలంలో నిలబడి ఉన్న మరో దుండగుడి వైపుకు విసిరాడు. ఆ తరువాత అతడు కూడా గోడ దూకి అటువైపు వెళ్లాడు.

ఈ క్రమంలోనే వీధి కుక్కలు వారిని వెంబడించాయి. అప్పుడు అమ్మాయి వారి పట్టు నుండి తప్పించుకుని సమీపంలోని ఆలయంలో దాక్కుంది. ఇక్కడ కుక్కలు కిడ్నాపర్లిద్దరినీ తరిమికొట్టాయి. కిడ్నాపర్లిద్దరూ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీయడం ప్రారంభించారు. ఈ విధంగా వారిద్దరూ పారిపోవడంతో బాలిక ప్రాణాలను కాపాడారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కానీ, ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..