మిగిలిపోయిన అన్నాన్ని ఇలా పెడితే మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..! ట్రై చేయండి..

ప్రతి అమ్మాయి తన జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకుంటుంది. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు వివిధ రకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తారు. కానీ, కెమికల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. వెంట్రుకలు పొడిబారుతుంటాయి. కాబట్టి జుట్టు సంరక్షణకు సహజసిద్ధమైన పద్ధతులను అనుసరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కేశ సంరక్షణలో రాత్రి మిగిలి అన్నం కూడా అద్భుతంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Nov 07, 2024 | 4:56 PM

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి పూట మిగిలిపోయిన అన్నం జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.. జుట్టు పోషణకు చద్దన్నం చాలా మేలు చేస్తుంది. అన్నం వాడకంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుందని చెబుతున్నారు. జుట్టుకు అన్నాన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
ఒక పెద్ద గిన్నెలో ఒక కప్పు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలి. అలాగే, రెండు స్పూన్ల మెంతులు కూడా తీసుకోవాలి. బీట్ రూట్ రసం, తాజా అలోవెరా జెల్ తీసుకోండి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టిన మెంతులు, అన్నంతో కలిపి మెత్తని పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. అందులో బీట్ రూట్ జ్యూస్, అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి.

2 / 5
ఈ హెయిర్ మాస్క్‌ను మీ జుట్టుకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయాలి. ఒక గంట పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూ, గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. జుట్టు రాలడం ఆగి పొడవుగా పెరుగుతుంది.

3 / 5
జుట్టుకు అన్నాన్ని పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ హెయిర్ ప్యాక్ ను జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే వెంట్రుకలు రాలే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు ఇది మీ జుట్టును మెరిసేలా, స్ట్రాంగ్ గా మార్చడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.

4 / 5
మరో పద్ధతిలో పావుకప్పు వండిన అన్నం తీసుకోండి. దానికి పావు కప్పు ఫ్లాక్స్ సీడ్ జెల్ యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ జెల్ లేకపోతే, బదులుగా అలోవెరా జెల్ ఉపయోగించవచ్చు. అందులో 1/2 స్పూన్ నల్ల నువ్వుల నూనె కలపాలి. కొన్ని చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ గ్రైండర్‌లో రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ ను స్కాల్ప్, హెయిర్ పై అప్లై చేయండి. 30 నిమిషాలు ఆరిన తరువాత వాష్‌ చేసుకోవాలి. తరువాత మీ జుట్టును హెర్బల్ షాంపూతో కడగాలి. ఇది మీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు మునుపటి కంటే చాలా మృదువుగా ఉంటుంది. క్రమంగా జుట్టు కోల్పోయిన షైన్ తిరిగి వస్తుంది. మీరు ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు.

5 / 5
Follow us
మిగిలిన అన్నాన్ని ఇలా పెడితే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.!

ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్.. ఈ వ్యక్తి క్రియేటివిటీ చూస్తే

జైల్లో వేస్తే వేసుకో.. యోగా చేసుకుంటా: కేటీఆర్

అత్యంత పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ఏదో తెలుసా? భారత్ ర్యాంకింగ్‌ ఎంత?

పట్టుమని పది వికెట్లు తీసేసరికి పొగరెక్కినట్టు ఉంది..

మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..

ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక.. ఆ యాప్స్ విషయంలో జాగ్రత్తలు అవసరం

అరుంధతి సినిమా కోసం సోనూసూద్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాంకే

రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక

బ్లాక్‌ కాఫీ తాగితే బరువు తగ్గుతారా.? ఇందులో నిజమెంతంటే..