- Telugu News Photo Gallery Technology photos Who is the owner of the vehicle vehicle number plate tells the details
Vehicle Number: కారు నంబర్ ద్వారా యజమాని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
Vehicle Number: మీరు వాహన యజమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని దాని నంబర్ ప్లేట్ నుండే పొందవచ్చు. దీని కోసం మీ మొబైల్ ద్వారా నిమిషాల్లోనే సులభంగా తెలుసుకోవచ్చు..
Updated on: Nov 07, 2024 | 6:47 PM

అపరిచిత వ్యక్తి తన కారును ఇంటి ముందు పార్క్ చేసి ఒక గంట లేదా రెండు గంటల పాటు అదృశ్యమైనప్పుడు అది ఎవరిదోనని టెన్షన్ పడుతుంటారు కొందరు. ఎందుకంటే ఇంటి ముందు పార్క్ చేసినందున మీరు మీ కారుని బయటకు తీయలేరు. రెండవది మీ వాహన పార్కింగ్ స్థలాన్ని మరొకరు ఆక్రమించినప్పుడు ఆ కారు ఎవరిదో తెలియక తికమక పడుతుంటారు. ఈ పరిస్థితిలో ఆ కారు ఎవరిది.. అతని చిరునామా ఎక్కడ? పూర్తి వివరాలు సులభంగా తెలుసుకునే వెసులుబాటు ఉంది.

వాహనం యజమానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని దాని నంబర్ ప్లేట్ నుండి ఎలా పొందాలో తెలుసుకుందాం. ఇలా చేయడం ద్వారా మీరు కారు యజమాని మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు.

మీకు వాహన యజమాని వివరాలు కావాలంటే మీరు mParivahan వెబ్‌సైట్, యాప్‌లో SMS ద్వారా పూర్తి వివరాలను పొందవచ్చు. దీని కోసం, మీ ఫోన్‌లో మెసేజింగ్ యాప్‌ను ఓపెన్ చేయండి. ఇప్పుడు VAHAN <వాహన ప్లేట్ నంబర్> అని టైప్ చేయండి. ఉదాహరణకు: VAHAN MH01TR3522. ఆ తర్వాత ఈ SMSని 7738299899 నంబర్‌కు పంపండి. సందేశం పంపడానికి ఒక రూపాయి ఖర్చు అవుతుందని గుర్తించుకోండి. సందేశాన్ని పంపిన తర్వాత మీకు అవసరమైన సమాచారం అందుతుంది. కొన్ని నిమిషాల్లో, మీరు వాహనం యజమాని పేరు, ఆర్టీవో వివరాలు, ఆర్‌సీ వివరాలు, ఇన్సూరెన్స్ వివరాలు ఇలా మొత్తం సమాచారాన్ని ఎస్‌ఎంఎస్ రూపంలో మీ మొబైల్‌కు వస్తుంది.

వెబ్‌సైట్ నుండి కూడా వివరాలు పొందవచ్చు: దీని కోసం ముందుగా మీ ఫోన్‌లో పరివాహన్ వెబ్‌సైట్ parivahanకి వెళ్లి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి. నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, లెన్స్ చిహ్నంపై క్లిక్ చేయండి. ఆ వాహనం నంబర్‌ను నమోదు చేసిన తర్వాత వెతకండి. దీని తర్వాత, మీరు వాహనం మోడల్, వాహన రిజిస్ట్రేషన్ తేదీ, ఆర్టీవో, యజమాని పేరు వంటి వివరాలు పొందుతారు.

యాప్ ద్వారా కూడా సమాచారం: దీని కోసం భారత ప్రభుత్వం mParivahan అనే యాప్‌ను రూపొందించింది. దీన్ని మీరు Google Play Storeకి వెళ్లి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాహన రవాణా అప్లికేషన్‌కు లాగిన్ చేయండి. దీని తర్వాత మీ RC స్థితిని తెలుసుకోండి అనే ఆప్షన్‌లోకి వెళ్లి, ఆ వాహనం నంబర్‌ణు నమోదు చేయండి. అప్పుడు మీరు ఇచ్చిన నమోదు చేసిన నంబర్ ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.




