AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులు బీ అలర్ట్‌..! డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారో తప్పదు పాకీజా పని.. వినూత్న తీర్పు ఇచ్చిన జడ్జి

కమ్యూనిటీ సర్వీస్ శిక్షలో భాగంగా మాతశిశు ఆస్పత్రిని దగ్గరుండి మందు బాబులతో శుభ్రం చేయిస్తున్నారు ట్రాపిక్ పోలీసులు. ఆసుపత్రి ఆవరణంలో వారం రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్ష అమలు చేయనున్నారు. కోర్టు వేసిన శిక్షకు అప్పీలు చేసుకునే అవకాశం కూడా లేదు.

మందుబాబులు బీ అలర్ట్‌..! డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారో తప్పదు పాకీజా పని.. వినూత్న తీర్పు ఇచ్చిన జడ్జి
A Different Punishment
Jyothi Gadda
|

Updated on: Nov 07, 2024 | 3:32 PM

Share

ఇటీవల కాలంలో డ్రంక్‌డ్రైవ్‌లో చాలామంది పట్టుబడుతున్నారు. ఇందులో మైనర్లతో పాటు మహిళలు కూడా మేం తక్కువ కాదు అన్నట్టుగా పోటీపడుతున్నారు. అయితే, వీరికి జరిమానా విధించడం, జైళ్ళలో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని భావించింన న్యాయస్థానం వారికి ఊహించని శిక్ష వేసింది. అందుకే ఈసారి ఏకంగా వారికి సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా శిక్షలను వేయాలనుకుంది కోర్టు. జైలు శిక్షలతోను, జరిమానాలతోను మానసిక పరివర్తన తీసుకురావడం కష్టమని భావించిన కోర్టు ఈసారి మందుబాబులకు సామాజిక శిక్ష విధించింది.

పీకల దాకా ఫుటుగా మద్యం తాగిన మందుబాబులకు మంచిర్యాల జిల్లా కోర్టు ఓ ఆశ్చర్యకరమైన శిక్ష విధించింది. ప్రస్తుతం అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల మాతా శిశు ఆస్పత్రిని క్లీన్ చేయాలంటూ కోర్టు ఆదేశించింది. మంచిర్యాల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 27 మంది మందు బాబులకు వారం రోజులపాటు మాతా శిశు ఆసుపత్రిని శుభ్రం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి ఉపనిషద్విని. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ఆస్పత్రిని శుభ్రం చేసేందుకు మందుబాబులను తరలించారు ట్రాఫిక్ పోలీసులు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

కమ్యూనిటీ సర్వీస్ శిక్షలో భాగంగా మాతశిశు ఆస్పత్రిని దగ్గరుండి మందు బాబులతో శుభ్రం చేయిస్తున్నారు ట్రాపిక్ పోలీసులు. ఆసుపత్రి ఆవరణంలో వారం రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్ష అమలు చేయనున్నారు. కోర్టు వేసిన శిక్షకు అప్పీలు చేసుకునే అవకాశం కూడా లేదు. దాంతో మందుబాబులు తమకు పడిన శిక్షను అమలు చేశారు. కోర్టు వేసిన శిక్షతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మందుబాబుల పుణ్యమా అని ఆస్పత్రి శుభ్రంగా మారుతుందని అంటున్నారు.  శిక్షలన్నీ ఇలా ఉంటే సమాజానికి కూడా మేలు జరుగుతుందంటున్నారు ఆస్పత్రిలో ఉన్న రోగులు. కోర్టు తీర్పుతో రోగుల బంధువులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..