కోల్‌కత్తాలో బైక్ రైడ్ బుక్ చెయ్యడమే తప్పయ్యింది

కోల్‌కత్తాలో బైక్ రైడ్ బుక్ చెయ్యడమే తప్పయ్యింది

|

Updated on: Nov 07, 2024 | 1:37 PM

నేటి సమాజంలో మహిళలు పిల్లలపై జరుగుతున్న వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. కఠిన శిక్షలు అమలు అవుతున్నా వేధింపులు అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కోల్‌కతాలో ఓ మహిళా వైద్యురాలికి బైక్ రైడర్‌ వేధింపులు ఎదురయ్యాయి. రైడర్ ఆమెకు అస్తమానం ఫోన్ చేయడంతో పాటు అసభ్య వీడియోలు పంపి వేధించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు శనివారం రాత్రి ఓ యాప్‌లో బైక్ రైడింగ్ బుక్ చేశారు. అయితే, బైక్ రావడం ఆలస్యం అవుతుండటంతో రైడ్‌ను రద్దు చేశారు. రైడ్ రద్దు చేసిందన్న ఆగ్రహంతో ఆ రైడర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. వైద్యురాలికి 17 సార్లు ఫోన్ చేయడంతోపాటు ఆమె వాట్సాప్‌కు అశ్లీల వీడియోలు పంపాడు. అక్కడితో ఆగకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయపడిన వైద్యురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kanguva: కంగువ విడుదల డౌటేనా ??

4 ఏళ్లలో ఎయిర్ పోర్టుకు మెట్రో !! రెండో దశకు మరో ముందడుగు

పేరుకే మారుమూల పల్లె !! ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే

ప్రతిరోజూ ఉప్పు నీరు తాగితే.. ఊహించలేని లాభాలు !!

Follow us