పేరుకే మారుమూల పల్లె !! ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే
అది మారుమూల పల్లె.. కొలువుల కేరాప్ గా ఆ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ గ్రామంలో ఏ ఇంటికెళ్లినా ప్రభుత్వ ఉద్యోగులే కనిపిస్తారు. మెదక్ జిల్లాలో ఉన్న వందలాది గ్రామాల్లో అక్కన్నపేట గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.. రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామం ప్రభుత్వ ఉద్యోగులకు కేరాఫ్ అడ్రస్గా మారింది..
ఒకరిని చూసి మరొకరు అన్నట్టు గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారిని ప్రేరణగా తీసుకుని సర్కారు ఉద్యోగాలు సాధించారు..ఊరిలో దాదాపు 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా అందులో ఎక్కువ మంది టీచర్లు ఉండటం విశేషం. కొన్ని ఫ్యామిలీల్లో భార్యా భర్తలు ఇద్దరూ టీచర్ ఉద్యోగాలు సాధించిన వారూ ఉన్నారు. ప్రతీ డీఎస్సీలోనూ ఈ ఊరి అభ్యర్థులు ప్రతిభ చూపి టీచర్ ఉద్యోగాలకు సెలక్ట్ అవుతుండటం మరో విశేషం. అక్కన్నపేట గ్రామంలో 1,010 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభా 4వేల545 మంది. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా ఆ ఊరిలో ఉన్నత చదువులు చదివిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపుతున్నారు. ఒకరిద్దరు కాదు.. గ్రామంలో మొత్తం174 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం విశేషం. పంచాయతీరాజ్ శాఖలో పది మంది పంచాయతీ సెక్రటరీలుగా పనిచేస్తుండగా, ఫారెస్ట్, పోస్టల్ఆర్టీసీ తదితర డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు ఎంపిక య్యారు..ఎక్కువ శాతం టీచర్లే. గ్రామంలో అన్ని వర్గాల వారు ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

