Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయం దగ్గర అఘోరీ ఆత్మహత్యాయత్నం...వీడియో

Srikalahasti: శ్రీకాళహస్తి ఆలయం దగ్గర అఘోరీ ఆత్మహత్యాయత్నం…వీడియో

Ram Naramaneni

|

Updated on: Nov 07, 2024 | 1:15 PM

శ్రీకాళహస్తి ఆలయంలోకి ప్రవేశించాలని చూసిన అఘోరీని ఆలయ సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో అఘోరీ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెపై నీటిని పోశారు.

గత నెల రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో ఉన్న అఘోరీ  శ్రీకాళహస్తి ఆలయం దగ్గర హల్‌చల్‌ చేసింది. నగ్నంగా ఉన్న అఘోరీని లోనికి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. దుస్తులు ధరిస్తేనే దర్శనానికి అనుమతిస్తామన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అఘోరీ.. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. అఘోరీ ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకున్నారు. స్థానికులు బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అఘోరీపై పోశారు. స్వామి దర్శనం చేసుకుని తీరుతానంటున్న అఘోరీ.. ఆలయం ముందే బైఠాయించింది. ఆమెను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం.. శ్రీకాళహస్తి దాటించే యత్నం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 07, 2024 01:06 PM