Death Calculator: AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
చావు, పుట్టుకలు దైవాదీనం.. ఏది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదంటారు. ఇటీవలి కాలంలో హఠాత్తుగా కుప్పకూలుతున్న సంఘటనలు కోకొల్లలు. మీ పుట్టిన తేదీ ఎప్పుడంటే మీ దగ్గర సమాధానం ఉంటుండొచ్చు కానీ మీరు ఎప్పుడు చనిపోతారన్న దానికి మాత్రం సమాధానం ఎవరి దగ్గర ఉండదు. అయితే ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో అది కూడా సాధ్యమే అంటున్నారు టెక్ నిపుణులు.
మనిషి ఎప్పుడు చనిపోతాడో కూడా చెప్పేసే టెక్నాలజీ వచ్చేస్తోంది. త్వరలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం ఖాయమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు. సైన్స్ భాషలో, ఈ టెక్నాలజీని AI డెత్ కాలిక్యులేటర్‌గా పిలుస్తున్నారు. లాన్సెట్ డిజిటల్ హెల్త్ ప్రచురించిన ఈ అధ్యయనంలో AI డెత్ కాలిక్యులేటర్ గురించి ప్రస్తావించారు. AI సహాయంతో మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు అని ఇందులో పేర్కొన్నారు. ఈ కాలిక్యులేటర్ ట్రయల్ యునైటెడ్ కింగ్‌డమ్ నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన రెండు ఆసుపత్రుల్లో త్వరలోనే ప్రారంభించనున్నారని పరిశోధకులు తెలిపారు. ఇక ఏఐ డెత్ కాలిక్యుటేలర్ అసలు పేరు AIRE. అంటే AI-ECG రిస్క్ ఎస్టిమేటర్. ఇది మీ గుండె వైఫల్యాన్ని అంచనా వేస్తుంది. మీ గుండె రక్తాన్ని పంపింగ్ చేయడం ఎప్పుడు ఆగిపోతుందో ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్ చెబుతుందన్నమాట. అంటే మీకు సహజ మరణం ఎప్పుడు సంభవిస్తుందన్న విషయాన్ని ఇది అంచనా వేయగలుగుతుంది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఆసుపత్రుల్లో వేలాది మంది ఈ ట్రయల్‌లో పాల్గొంటున్నారు. ప్రజలు దీనికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. వైద్యులు సులభంగా గుర్తించలేని వ్యాధుల గురించి కూడా ఈ AI డెత్ కాలిక్యులేటర్ చెబుతోంది.
ఇప్పటి వరకు నిర్వహించిన ట్రయల్స్ ఆధారంగా ఈ కాలిక్యులేటర్ 78 శాతం కరెక్ట్‌గా చెబుతోంది. ఈ AI డెత్ కాలిక్యులేటర్‌ను రూపొందిస్తున్న సంస్థ.. 11.60 లక్షల మంది రోగులకు ECG రిపోర్ట్‌లను సేకరించింది. వీటిని విశ్లేషించడం ద్వారా వారి గుండె ఎప్పుడు ఆగిపోతుందన్న వివరాలను ప్రచురించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

