ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. పెట్రోల్‌తో పన్లేని పవర్‌ఫుల్ బైక్.. గాలిలో రయ్ రయ్‌మంటూ

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలల ఏ వింతలు జరుగుతున్నా.. ఠక్కున ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం అవుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ఇప్పుడు తెలుసుకుందామా..

ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. పెట్రోల్‌తో పన్లేని పవర్‌ఫుల్ బైక్.. గాలిలో రయ్ రయ్‌మంటూ
Trending
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 07, 2024 | 4:54 PM

సోషల్ మీడియా పుణ్యామా అని ఎంతోమంది ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు వ్యూస్, లైకుల కోసం వింత వింత పనులు చేస్తుంటే.. మరికొందరు తమలోని ప్రతిభకు పదునుపెట్టి.. సరికొత్త ఆవిష్కరణలను రూపుదిద్దుతున్నారు. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక దాన్ని చూసి నెటిజన్లు షాక్ కావడం ఖాయం. ఈ వీడియోను ‘vasu_n_patel’ అనే ఇన్‌స్టా యూజర్ నెట్టింట పోస్ట్ చేశారు.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డుపై విచిత్రమైన బైకుతో రయ్ రయ్‌మంటూ దూసుకుపోతున్నట్టు మీరు చూడవచ్చు. అయితే ఇక్కడొక ఆసక్తికర విషయమేంటంటే.. ఆ బైక్‌కు పెట్రోల్ ట్యాంక్ లేదు, పెడల్ లేదు.. మరి ఇవి రెండూ లేకపోయినా.. ఆ బైక్ వేగంగా దూసుకుపోతోంది. అటుగా వెళ్తున్న మరో ప్రయాణీకుడు ఈ బైక్ వీడియోను తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెట్రోల్‌తో పన్లేకుండా.. పెడల్ అవసరం లేకుండానే ఈ బైక్ ఎలా నడుస్తోందో చెప్పండంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. నెటిజన్లు వరుసపెట్టి దీనిపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. లేట్ ఎందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

View this post on Instagram

A post shared by Vasu N Patel (@vasu_n_patel)

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..