పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలిన శబ్ధం..! ఏంటని మరింత లోతుకు తవ్వగా..

బాబర్ కాలంలో భారతదేశానికి తుపాకులు తీసుకువచ్చారు. ప్రస్తుతం, వాటిపై పూర్తి అధ్యయనం జరుగుతుందని చెప్పారు. ఇంతకు ముందు కూడా ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో జరిపిన తవ్వకాల్లో ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర ఆనవాళ్లు బయటపడ్డాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అవన్నీ మొఘల్ యుగానికి చెందినవిగా గుర్తించారు.

పొలం దున్నుతుండగా నాగలికి ఏదో తగిలిన శబ్ధం..! ఏంటని మరింత లోతుకు తవ్వగా..
18th Century Weapons
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2024 | 5:19 PM

యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్థులు తమ పొలాలను దున్నుతుండగా పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. సమాచారం ప్రకారం ఈ ఆయుధాలన్నీ 18వ శతాబ్ధానికి చెందినవిగా చెబుతున్నారు. సుమారుగా ఇవి 200 ఏళ్ల నాటివని సమాచారం. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం..రైతులు పొలం దున్నుతుండగా నాగలికి ఐరన్‌ వస్తువు తగిలిన శబ్దం వినిపించిందని, వెంటనే అక్కడ తవ్వకాలు జరిపినట్టుగా చెప్పారు. కొంత లోతు వరకు తవ్వగా కత్తులు, బాకులు, ఈటెలు, తుపాకులు లభించాయని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు వెంటనే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. పురావస్తు శాఖకు కూడా సమాచారం అందించారు. దీంతో పాటు తిల్హార్ ఎమ్మెల్యే సలోనా కుష్వాహా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

షాజహాన్‌పూర్‌లోని ధాకియా తివారీ గ్రామానికి చెందిన బాబు రామ్ మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం పొలంలో ఉన్న మట్టిని జేసీబీ నుంచి తొలగించినట్లు తెలిపారు. అదే పొలంలో మట్టిని తవ్వేసిన తరువాత ఇప్పుడు మొదటిసారిగా పొలాలను దున్నుతున్నట్టుగా చెప్పారు. ఈ క్రమంలోనే పురాతన ఆయుధాలు లభించాయని చెప్పారు.

ఈ విషయానికి సంబంధించి, చరిత్రకారుడు వికాస్ ఖురానా మాట్లాడుతూ, ఈ ఆయుధాలు 18వ శతాబ్దానికి చెందినవి కావచ్చు అన్నారు. ఎందుకంటే భారతదేశంలో తుపాకుల వాడకం 18వ శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పారు. బాబర్ కాలంలో భారతదేశానికి తుపాకులు తీసుకువచ్చారు. ప్రస్తుతం, వాటిపై పూర్తి అధ్యయనం జరుగుతుందని చెప్పారు. ఇంతకు ముందు కూడా ఉత్తరప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో జరిపిన తవ్వకాల్లో ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర ఆనవాళ్లు బయటపడ్డాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అవన్నీ మొఘల్ యుగానికి చెందినవిగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..